జైల్లో తిండిమానేసిన నిర్భయ నిందితులు....

దేశాన్నే షేక్ చేసిన నిర్భయ ఘటనలో… ఢిల్లీలోని తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న నిర్భయ నిందితులు తాజాగా తిండిమానేశారట.. ఈ నెల 20లోపు వారిని ఉరితీయడానికి సన్నాహాలు జరుగుతున్న సమయంలోనే వారు ఉరిశిక్ష పడుతోందనే విషయం తెలియగానే భోజనం తగ్గించేశారని పోలీసులు చెబుతున్నారు. తాజాగా ఈ నలుగురు నిందితులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారణకు హాజరయ్యారు. వీరు జైల్లో అంతకుముందు పుష్టిగా భోజనం చేసేవారని.. ప్రస్తుతం ఉరితీసే తేది సమీపిస్తున్న నేపథ్యంలో ఆహారం తగ్గించివేశారని జైలు […]

Advertisement
Update:2019-12-14 10:05 IST

దేశాన్నే షేక్ చేసిన నిర్భయ ఘటనలో… ఢిల్లీలోని తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న నిర్భయ నిందితులు తాజాగా తిండిమానేశారట.. ఈ నెల 20లోపు వారిని ఉరితీయడానికి సన్నాహాలు జరుగుతున్న సమయంలోనే వారు ఉరిశిక్ష పడుతోందనే విషయం తెలియగానే భోజనం తగ్గించేశారని పోలీసులు చెబుతున్నారు.

తాజాగా ఈ నలుగురు నిందితులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారణకు హాజరయ్యారు. వీరు జైల్లో అంతకుముందు పుష్టిగా భోజనం చేసేవారని.. ప్రస్తుతం ఉరితీసే తేది సమీపిస్తున్న నేపథ్యంలో ఆహారం తగ్గించివేశారని జైలు అధికారులు కోర్టుకు వెల్లడించారు.

ఇక 2013లో నిర్భయ నిందితుడు రాంసింగ్ జైల్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వీరు కూడా ఆత్మహత్య చేసుకుంటారేమోనని ప్రతి ఒక్కరిని వేర్వేరుగా జైలు గదుల్లో ఉంచి… హిందీ రాని పోలీసులతో పహారా కాయిస్తున్నారు. ఒక్కొక్కరికి ఐదుగురు పోలీసులను కాపాలాగా ఉంచారు.

ఉరిశిక్షకు సమయం దగ్గరపడుతుండడంతో నిందితుల్లో నైరాశ్యం కమ్ముకుందని, తిండిమానేశారని జైలు వర్గాలు తెలిపాయి. నిర్భయపై దారుణ అత్యాచారం చేసిన వీరిని త్వరగా ఉరితీయాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.

Tags:    
Advertisement

Similar News