జగన్ దెబ్బ... ఎడిటర్ పదవి నుంచి తప్పుకున్న రామోజీ...
ఈనాడు పత్రికలో కీలక మార్పు చోటు చేసుకున్నట్టు అనిపిస్తోంది. ఎడిటర్ పదవి నుంచి రామోజీరావు తప్పుకున్నారు. నిన్నటి వరకు ఈనాడు పత్రిక ఎడిటర్‌గా రామోజీరావు పేరును ఆఖరి పేజీలో ముద్రించేది. కానీ నేడు కొత్త మార్పు కనిపించింది. ఈనాడు పత్రిక ఏపీ ఎడిషన్ ఎడిటర్‌గా ఎం నాగేశ్వర రావును నియమించారు. తెలంగాణ ఎడిషన్ ఎడిటర్‌గా ప్రసాద్ పేరును ఈనాడు పత్రిక ముద్రించింది. రామోజీరావును నిన్నటి వరకు ఎడిటర్ అని ప్రచురించిన పత్రిక.. ఈ రోజు కేవలం ఫౌండర్ […]
ఈనాడు పత్రికలో కీలక మార్పు చోటు చేసుకున్నట్టు అనిపిస్తోంది. ఎడిటర్ పదవి నుంచి రామోజీరావు తప్పుకున్నారు. నిన్నటి వరకు ఈనాడు పత్రిక ఎడిటర్‌గా రామోజీరావు పేరును ఆఖరి పేజీలో ముద్రించేది. కానీ నేడు కొత్త మార్పు కనిపించింది.
ఈనాడు పత్రిక ఏపీ ఎడిషన్ ఎడిటర్‌గా ఎం నాగేశ్వర రావును నియమించారు. తెలంగాణ ఎడిషన్ ఎడిటర్‌గా ప్రసాద్ పేరును ఈనాడు పత్రిక ముద్రించింది. రామోజీరావును నిన్నటి వరకు ఎడిటర్ అని ప్రచురించిన పత్రిక.. ఈ రోజు కేవలం ఫౌండర్ అని మాత్రమే ప్రచురించింది.
ఈ మార్పు ఎందుకు జరిగింది అన్న దానిపై పలు రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రామోజీరావు వయసు రిత్యా పని ఒత్తిడి తగ్గించుకునే ఉద్దేశంతో ఎడిటర్ నుంచి తప్పుకుని ఆ స్థానంలో మరొకరిని నియమించి ఉంటారని ఒక అభిప్రాయం.
రాజకీయ వర్గాలు మాత్రం ఇది ముమ్మాటికీ జగన్‌మోహన్ రెడ్డి దెబ్బే అని అభిప్రాయపడుతున్నాయి. జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం తెచ్చిన జీవో 2430 కారణంగానే రామోజీరావు తప్పుకుని ఉంటారని వ్యాఖ్యానిస్తున్నారు.
పత్రికలు సత్యదూరమైన వార్తలు ప్రచురిస్తే చర్యలు తీసుకునేందుకు, కేసులు పెట్టేందుకు జీవో తెచ్చారు. అందుకు తొలుత ఎడిటర్ బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రామోజీరావు తప్పుకుని ఏపీ, తెలంగాణ ఎడిషన్ లకు వేరు వేరుగా కొత్తవారిని ఎడిటర్లుగా నియమించి ఉంటారని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
తప్పుడు పనుల కోసం ”ఈనాడు” నియమించుకున్న ఒక ఉద్యోగి చంద్రబాబు