రంగంలోకి బాబు బీజేపీ మనుషులు

జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడా దొరకడం లేదు. ప్రతిపక్షాలు గళమెత్తేలోగానే సమస్యకు పరిష్కారం చూపెట్టేందుకు పరుగులు తీస్తోంది. ఇసుక, ఇంగ్లీష్, ఉల్లిపాయలు… ఇలా ఏ అంశాన్ని పట్టుకున్నా చివరకు ప్రతిపక్షాలకు బూడిదే మిగులుతోంది. శాంతిభద్రతలు దెబ్బతిన్నాయంటూ ఆ మధ్య చంద్రబాబు హడావుడి చేశారు. కానీ ఎక్కడా ఆ ఆనవాళ్లు కూడా కనిపించలేదు. దాంతో ఆ అంశాన్ని చంద్రబాబు వదిలేశారు. కాకపోతే కొత్త దారిలో జగన్‌ను ఇబ్బంది పెట్టేందుకు చంద్రబాబు పావులు కదుపుతున్నారు. బీజేపీలో ఉన్న తన మనుషుల […]

Advertisement
Update:2019-12-14 05:43 IST

జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడా దొరకడం లేదు. ప్రతిపక్షాలు గళమెత్తేలోగానే సమస్యకు పరిష్కారం చూపెట్టేందుకు పరుగులు తీస్తోంది.

ఇసుక, ఇంగ్లీష్, ఉల్లిపాయలు… ఇలా ఏ అంశాన్ని పట్టుకున్నా చివరకు ప్రతిపక్షాలకు బూడిదే మిగులుతోంది. శాంతిభద్రతలు దెబ్బతిన్నాయంటూ ఆ మధ్య చంద్రబాబు హడావుడి చేశారు. కానీ ఎక్కడా ఆ ఆనవాళ్లు కూడా కనిపించలేదు. దాంతో ఆ అంశాన్ని చంద్రబాబు వదిలేశారు. కాకపోతే కొత్త దారిలో జగన్‌ను ఇబ్బంది పెట్టేందుకు చంద్రబాబు పావులు కదుపుతున్నారు.

బీజేపీలో ఉన్న తన మనుషుల ద్వారా జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వంపై కేంద్రానికి వీలైనన్ని ఎక్కువ ఫిర్యాదులు అందేలా చంద్రబాబు పావులు కదులుపుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే సుజనాచౌదరి అదే పనిలో ఉన్నారు. కేంద్రంలో కనిపించిన పెద్దలందరి వద్ద ఏపీలో ఏదో జరిగిపోతోంది అని నూరిపోస్తున్నారన్న విమర్శలు వైసీపీ నుంచి వస్తున్నాయి.

బీజేపీలోనే ఉన్న మరికొందరు చోటామోటా నేతలను కూడా ఈ పని మీద బాబు బ్యాచ్ ఉసిగొల్పుతోంది. బాబు సామాజికవర్గానికి చెందిన బీజేపీ నేతలు జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వంపై పదేపదే ఫిర్యాదులు చేస్తున్నారు.

రాయలసీమకు చెందిన చంద్రబాబు సామాజికవర్గానికే చెందిన ఒక చోటా నేత నేరుగా కేంద్ర హోంమంత్రిని కలిసి జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం బీజేపీ కార్యకర్తలపై దాడులు చేస్తోంది అని ఫిర్యాదు చేశారు. ఇది కూడా బాబు డైరెక్షన్‌లో జరుగుతున్న తంతుగానే భావిస్తున్నారు.

ఎలాగైనా జగన్‌మోహన్‌ రెడ్డికి, బీజేపీ పెద్దల మధ్య శత్రుభావం పెంచాలన్న ఉద్దేశంతో పనిగట్టుకుని ఇలా ఉన్నవి లేనివి పదేపదే కేంద్ర పెద్దల వద్ద నూరిపోసే ప్రయోగం చేస్తున్నారని వైసీపీ వర్గాలు అనుమానిస్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News