తప్పుడు పనుల కోసం "ఈనాడు" నియమించుకున్న ఒక ఉద్యోగి చంద్రబాబు
జగన్‌మోహన్ రెడ్డి 16 నెలలు జైలులో చిప్పకూడు తినివచ్చారంటూ టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. మార్షల్స్ పై చంద్రబాబు, నారా లోకేషే దాడి చేశారని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షనాయకుడిగా చంద్రబాబు లోనికి రావడానికి ప్రత్యేకంగా ద్వారం ఉందన్నారు. కానీ చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా రోడ్డు మీదే కారు దిగి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను వెంటేసుకుని బ్యానర్లు పట్టుకుని ఒకేసారి దూసుకొచ్చారన్నారు. దాంతో ఆ సమూహంలో ఎవరెవరు ఉన్నారో అర్థం కాక భద్రతా […]
జగన్‌మోహన్ రెడ్డి 16 నెలలు జైలులో చిప్పకూడు తినివచ్చారంటూ టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. మార్షల్స్ పై చంద్రబాబు, నారా లోకేషే దాడి చేశారని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షనాయకుడిగా చంద్రబాబు లోనికి రావడానికి ప్రత్యేకంగా ద్వారం ఉందన్నారు. కానీ చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా రోడ్డు మీదే కారు దిగి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను వెంటేసుకుని బ్యానర్లు పట్టుకుని ఒకేసారి దూసుకొచ్చారన్నారు.
దాంతో ఆ సమూహంలో ఎవరెవరు ఉన్నారో అర్థం కాక భద్రతా సిబ్బంది గేట్లు వేసి సభ్యులను ఒక్కొక్కరిగా లోనికి రావాల్సిందిగా కోరారన్నారు. కానీ చంద్రబాబు, నారా లోకేష్ మాత్రం అంతా ఒకేసారి వస్తామంటూ చీఫ్ మార్షల్స్‌ను బూతులు తిట్టి… నేరుగా చేతులతో తోసేశారన్నారు. వీరి దాడిలో భద్రతా సిబ్బంది గాయపడితే…. తిరిగి అసెంబ్లీలోకి వచ్చి డ్రామా ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. సమూహంలో ఎవరైనా ఇతర వ్యక్తులు వచ్చి అసెంబ్లీలో ఏమైనా చేస్తే అప్పుడు బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నించారు.
జగన్‌మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉన్నారన్నది అందరికీ తెలుసని… కాంగ్రెస్‌ను వ్యతిరేకించారు కాబట్టే తప్పుడు కేసులుపెట్టారన్నది అందరికీ తెలుసన్నారు. అవి తెలిసిన తర్వాతే ప్రజలు జగన్‌మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేశారన్నారు. కాంగ్రెస్ నుంచి 35 ఏళ్ల వయసులో ఒంటిరిగా బయటకు వచ్చి… ఒక వ్యవస్థను తయారు చేసిన వ్యక్తి జగన్‌మోహన్ రెడ్డి అని కొడాలి నాని వ్యాఖ్యానించారు.
ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఆయన ఫొటో పెట్టుకుని ఈనాడు పత్రిక తన సర్కులేషన్‌ను 60 వేల నుంచి మూడు లక్షలకు పెంచుకుందన్నారు. ఎన్టీఆర్ ఈనాడు పత్రికకు ఉపయోగపడ్డారే గానీ… ఈనాడు పత్రిక మీద ఎన్టీఆర్ ఏనాడు ఆధారపడలేదన్నారు. అదే చంద్రబాబు తన వెంట 10 మంది ఎమ్మెల్యేలు లేనప్పటికీ… వైస్రాయ్ హోటల్‌లో 165 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఈనాడులో రాయించుకుని ముఖ్యమంత్రి అయ్యారని కొడాలి ఫైర్ అయ్యారు.
ఈనాడు పత్రికలో చంద్రబాబు ఒక ఉద్యోగి అని వ్యాఖ్యానించారు. తాము చేసే తప్పుడు పనులకు ఉపయోగపడుతారని ఈనాడు లాంటి సంస్థలన్నీ కలిసి చంద్రబాబును ఒక ఉద్యోగిగా నియమించుకున్నాయని కొడాలి విమర్శించారు.
ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీలోకి దూరి పందికొక్కులాగా ఆ వ్యవస్థను నాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు అని… అదే జగన్‌మోహన్ రెడ్డి ఒక వ్యక్తిగా బయటకు వచ్చి ఒక వ్యవస్థను సృష్టించారని కొడాలి నాని వ్యాఖ్యానించారు. ఈ విషయం గుర్తు పెట్టుకుని టీడీపీ సభ్యులు మాట్లాడితే మంచిదన్నారు.