ఆనం రామనారాయణరెడ్డికి విజయసాయిరెడ్డి హెచ్చరిక

నెల్లూరు పట్టణాన్ని మాఫియాలకు అప్పగించారంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన… వైసీపీ ఒక ప్రాంతీయ పార్టీ అని, అధినేత ఆదేశాలతోనే అందరూ నడుచుకోవాల్సి ఉంటుందన్నారు. ఏ ఒక్కరు లైన్ దాటినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ”వైసీపీ ఒక ప్రాంతీయ పార్టీ. ప్రతి ఒక్కరూ కూడా అధినేత జగన్‌మోహన్ రెడ్డి గారు ఏది చెబితే అలా నడుచుకోవాల్సిందే. ఏ ఒక్కరు దాన్ని అతిక్రమించినా తప్పకుండా […]

Advertisement
Update:2019-12-07 10:12 IST

నెల్లూరు పట్టణాన్ని మాఫియాలకు అప్పగించారంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు.

తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన… వైసీపీ ఒక ప్రాంతీయ పార్టీ అని, అధినేత ఆదేశాలతోనే అందరూ నడుచుకోవాల్సి ఉంటుందన్నారు. ఏ ఒక్కరు లైన్ దాటినా చర్యలు తప్పవని హెచ్చరించారు.

”వైసీపీ ఒక ప్రాంతీయ పార్టీ. ప్రతి ఒక్కరూ కూడా అధినేత జగన్‌మోహన్ రెడ్డి గారు ఏది చెబితే అలా నడుచుకోవాల్సిందే. ఏ ఒక్కరు దాన్ని అతిక్రమించినా తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఇందులో ఎలాంటి సందేహం లేదు.

పార్టీ లైన్‌ను ఎవరూ కూడా క్రాస్ చేయడానికి వీల్లేదు. ఏదైనా అభిప్రాయభేదాలుంటే, ఒక విషయం మీద విభేదించాల్సి వస్తే పార్టీ అధ్యక్షుడికి నేరుగా చెప్పాలే గానీ.. మీడియా సమావేశంలో మాట్లాడడం సరికాదు.. అలా చేస్తే ఎవరైనా సరే అది విజయసాయిరెడ్డి అయినా… సుబ్బారెడ్డి అయినా, రామకృష్ణారెడ్డి అయినా, మరొకరు అయినా సరే చర్యలు మాత్రం తప్పవు. క్రమశిక్షణకు పార్టీ చాలా ప్రాధాన్యత ఇస్తుంది”అని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.

Tags:    
Advertisement

Similar News