హైదరాబాద్ టీ-20లో హాట్ ఫేవరెట్ బారత్

రాజీవ్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు మ్యాచ్ రిషబ్ పంత్, రాహుల్ ల సత్తాకు పరీక్ష 2020 టీ-20 ప్రపంచకప్ కు సన్నాహకంగా డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్ తో మూడుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలిసమరానికి… హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ పోటీలో 5వ ర్యాంకర్ భారత్ హాట్ ఫేవరెట్ గా పోటీకి దిగుతోంది. తొలిసారిగా పూర్తిస్థాయి జట్టుతో విరాట్ కొహ్లీ నాయకత్వంలో భారతజట్టు క్లీన్ […]

Advertisement
Update:2019-12-06 03:26 IST
  • రాజీవ్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు మ్యాచ్
  • రిషబ్ పంత్, రాహుల్ ల సత్తాకు పరీక్ష

2020 టీ-20 ప్రపంచకప్ కు సన్నాహకంగా డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్ తో మూడుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలిసమరానికి… హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది.

రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ పోటీలో 5వ ర్యాంకర్ భారత్ హాట్ ఫేవరెట్ గా పోటీకి దిగుతోంది. తొలిసారిగా పూర్తిస్థాయి జట్టుతో విరాట్ కొహ్లీ నాయకత్వంలో భారతజట్టు క్లీన్ స్వీప్ కు గురిపెట్టింది.

మరోవైపు డాషింగ్ ఆల్ రౌండర్ కిరాన్ పోలార్డ్ నాయకత్వంలోని విండీస్ జట్టు మాత్రం …డాషింగ్ ఆల్ రౌండర్లు రసెల్, బ్రాత్ వెయిట్, పూరన్ లాంటి స్టార్ ప్లేయర్లు లేకుండానే..పలువురు యువఆటగాళ్లతో భారత్ కు సవాలు విసురుతోంది.

తుదిజట్టులో చోటుకోసం పోటాపోటీ..

భారత తుదిజట్టులో చోటు కోసం భారత ఫాస్ట్ బౌలర్ల జోడీ మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్ పోటీపడుతుంటే…స్పిన్నర్ బెర్త్ కోసం కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహాల్ నువ్వానేనా అన్నట్లుగా తలపడుతున్నారు.

మరోవైపు ..వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్, యువ ఓపెనర్ రాహుల్ ల సత్తాకు ఈ సిరీస్ సవాలు కానుంది.

ఈ ఇద్దరూ నిలకడగా రాణించగలిగితేనే ప్రపంచకప్ లో తమతమ స్థానాలను ఖాయం చేసుకొనే అవకాశం ఉంది.

ధోనీ రికార్డు వైపు రిషభ్ చూపు..

వెస్టిండీస్ ప్రత్యర్థిగా ఐదుగురు బ్యాట్స్ మన్ ను అవుట్ చేసిన వికెట్ కీపర్ గా ధోనీ పేరుతో ఉన్న రికార్డు ను రిషభ్ పంత్ అధిగమించాలన్న పట్టుదలతో ఉన్నాడు.

ఇప్పటి వరకూ రిషభ్ ముగ్గురిని పడగొట్టాడు. మరో ముగ్గురిని అవుట్ చేయగలిగితే ధోనీ రికార్డును తెరమరుగు చేసే అవకాశం ఉంది.

ఇక..భారత డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ..హైదరాబాద్ మ్యాచ్ లో ఒక్క సిక్సర్ బాదగలిగితే…అంతర్జాతీయ క్రికెట్లో 400 సిక్సర్లు సాధించిన భారత తొలి క్రికెటర్ గా రికార్డుల్లో చేరగలుగుతాడు. మొత్తం మూడుఫార్మాట్లలో కలసి రోహిత్ కు 399 సిక్సర్లు బాదిన ఘనత ఉంది.

170 సాధించిన జట్టుకే విజయావకాశాలు..

రెండేళ్ల విరామం తర్వాత హైదరాబాద్ వేదికగా జరుగనున్న ఈ టీ-20 పోరులో…170కి పైగా పరుగులు సాధించిన జట్టుకే విజయావకాశాలు ఉంటాయి.

2018 ఐపీఎల్ సీజన్లో హైదరాబాద్ వేదికగా ముగిసిన మ్యాచ్ లో 162 పరుగుల సగటు స్కోరు నమోదు కావడం విశేషం.

విండీస్ కు డూ ఆర్ డై…

కిరాన్ పోలార్డ్ నాయకత్వంలోని 10వ ర్యాంకర్ వెస్టిండీస్ జట్టు కు భారత్ నుంచి అసలుసిసలు పరీక్ష ఎదురుకానుంది. అప్ఘనిస్థాన్ తో ఇటీవలే ముగిసిన సిరీస్ లో 1-2తో పరాజయం పొందిన కరీబియన్ టీమ్..భారత్ కు ఎంత వరకూ గట్టిపోటీ ఇవ్వగలదన్నది అనుమానమే.

రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ కోసం తెలుగురాష్ట్ర్రాల క్రికెట్ అభిమానులు ఎక్కడలేని ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News