రోహిత్ శర్మ కు వద్దంటే డబ్బు

వెంటపడుతున్న బహుళజాతి కంపెనీలు ఏడాదికి 75 కోట్లకు చేరనున్న రోహిత్ సంపాదన భారత డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ కు వద్దంటే యాడ్లు వచ్చి పడుతున్నాయి. వచ్చే ఏడాది ఆస్ట్ర్రేలియా వేదికగా జరిగే 2020 టీ-20 ప్రపంచకప్ కు ముందే తమ బ్రాండ్లకు ప్రచారకర్తగా ఉండాలంటూ రోహిత్ వెంట పలు బహుళజాతి సంస్ధలు వెంటపడుతున్నాయి. ప్రస్తుతం ఓ యాడ్లో నటించినందుకు రోహిత్ రోజుకు కోటిరూపాయలు ఫీజుగా తీసుకొంటున్నాడు. మొత్తం 20 బహుళజాతి సంస్థలు రోహిత్ కు తమ బ్రాండ్ అంబాసిడర్ […]

Advertisement
Update:2019-11-30 11:40 IST
  • వెంటపడుతున్న బహుళజాతి కంపెనీలు
  • ఏడాదికి 75 కోట్లకు చేరనున్న రోహిత్ సంపాదన

భారత డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ కు వద్దంటే యాడ్లు వచ్చి పడుతున్నాయి. వచ్చే ఏడాది ఆస్ట్ర్రేలియా వేదికగా జరిగే 2020 టీ-20 ప్రపంచకప్ కు ముందే తమ బ్రాండ్లకు ప్రచారకర్తగా ఉండాలంటూ రోహిత్ వెంట పలు బహుళజాతి సంస్ధలు వెంటపడుతున్నాయి.

ప్రస్తుతం ఓ యాడ్లో నటించినందుకు రోహిత్ రోజుకు కోటిరూపాయలు ఫీజుగా తీసుకొంటున్నాడు. మొత్తం 20 బహుళజాతి సంస్థలు రోహిత్ కు తమ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలంటూ ఆఫర్లు ఇచ్చాయి.

సియెట్ టైర్స్, అడిడాస్, హుబ్లోట్ వాచెస్, రెలిస్ ప్రే, రస్నా, ట్రుసోక్స్, షార్ప్ ఎలక్ట్రానిక్స్, డ్రీమ్-11 తో సహా మొత్తం 20 రకాల బ్రాండ్లకు రోహిత్ ప్రచారకర్తగా పనిచేయాలని నిర్ణయించాడు.

కేవలం ఎండార్స్ మెంట్ల ద్వారానే రోహిత్ ఆదాయం ఏడాదికి 75 కోట్ల రూపాయలకు చేరే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

ఇంగ్లండ్ వేదికగా ముగిసిన వన్డే ప్రపంచకప్ లో ఐదు సెంచరీలతో ప్రపంచ రికార్డు నెలకొల్పిన 32 సంవత్సరాల రోహిత్..ఇటీవలే ముగిసిన టెస్ట్ సిరీస్ లో సైతం అత్యుత్తమంగా రాణించాడు.

వచ్చే ఏడాది ఆస్ట్ర్రేలియా వేదికగా జరిగే టీ-20 ప్రపంచకప్ లో సైతం రోహిత్ భారత్ స్టార్ ప్లేయర్ గా నిలువనున్నాడు.

ఎండార్స్ మెంట్లు, భారత, ఐపీఎల్ కాంట్రాక్టులు, మ్యాచ్ ఫీజుల ద్వారా రోహిత్ శర్మకు లభించే ఆదాయం ఏడాదికి 100 కోట్ల రూపాయలు దాటే అవకాశం లేకపోలేదు.

Tags:    
Advertisement

Similar News