వర్మ సినిమా విడుదల ఆగిపోయింది

రేపు రిలీజ్ అవ్వాల్సిన కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా విడుదల ఆగిపోయింది. ఈ సినిమాను నిలుపుదల చేస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. సినిమాను ఇంకా క్లియర్ చేయలేదని సెన్సార్ బోర్డ్ చెప్పడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. మరో వారం రోజుల్లో సినిమాలో అభ్యంతరాలపై నివేదిక సమర్పించి, రిలీజ్ కు లైన్ క్లియర్ చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ సినిమా టైటిల్ నుంచి కంటెంట్ వరకు అంతా అభ్యంతరకరంగా ఉందంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సినిమా విడుదలైతే […]

Advertisement
Update:2019-11-28 16:29 IST

రేపు రిలీజ్ అవ్వాల్సిన కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా విడుదల ఆగిపోయింది. ఈ సినిమాను నిలుపుదల చేస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. సినిమాను ఇంకా క్లియర్ చేయలేదని సెన్సార్ బోర్డ్ చెప్పడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. మరో వారం రోజుల్లో సినిమాలో అభ్యంతరాలపై నివేదిక సమర్పించి, రిలీజ్ కు లైన్ క్లియర్ చేయాలని కోర్టు ఆదేశించింది.

ఈ సినిమా టైటిల్ నుంచి కంటెంట్ వరకు అంతా అభ్యంతరకరంగా ఉందంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సినిమా విడుదలైతే కుల ఘర్షణలు చెలరేగుతాయని, కొందరు మనోభావాలు దెబ్బతింటాయని పిటిషన్ పడింది. దీనిపై సెన్సార్ ను కోర్టు వివరణ కోరగా.. సినిమా ఇంకా సెన్సార్ చేయలేదని అధికారులు చెప్పారు. దీంతో రిలీజ్ ఆగిపోయింది.

మరోవైపు తమ సినిమాకు టైటిల్ మారుస్తామని, ”అమ్మ రాజ్యంలో… కడప బిడ్డలు” టైటిల్ తో విడుదల చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ మేకర్స్ అఫిడవిట్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు అభ్యంతరం వ్యక్తంచేసింది. సెన్సార్ అనుమతులు వచ్చిన తర్వాత మాత్రమే విడుదలపై తీర్పు ఇస్తామని విస్పష్టంగా ప్రకటించింది.

ప్రస్తుతం బంతి సెన్సార్ బోర్డులో ఉంది. మరో వారం రోజుల్లో సెన్సార్ అధికారులు ఈ సినిమాను చూడబోతున్నారు. విషయం కోర్టు వరకు వెళ్లడంతో ఎలాంటి రిస్క్ తీసుకోకుండా.. అభ్యంతరం ఉన్న సన్నివేశాలన్నింటికీ కట్స్ సూచించబోతున్నారు సెన్సార్ అధికారులు. టైటిల్ కూడా మార్చాల్సిందిగా సూచించే అవకాశం ఉంది.

Tags:    
Advertisement

Similar News