మహారాష్ట్రపై సుప్రీం తీర్పు... రేపే బలపరీక్ష, లైవ్‌ ప్రసారం

మహారాష్ట్ర రాజకీయ పరిణామాలపై సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. రేపే బలపరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. ముగ్గురు జడ్జిల ఏకాభిప్రాయంతో తీర్పు వెలువరించారు. గవర్నర్‌ బీజేపీకి ఇచ్చిన గడువు కంటే మూడు రోజుల ముందే బలపరీక్ష నిర్వహించాలని సుప్రీం తీర్పు చెప్పింది. బుధవారం సాయంత్రం 5లోపు బలపరీక్ష పూర్తి కావాలని సుప్రీం స్పష్టం చేసింది. ప్రొటెం స్పీకరే బలపరీక్ష నిర్వహిస్తారని సుప్రీం కోర్టు తన తీర్పులో చెప్పింది. తక్షణం ప్రొటెం స్పీకర్‌ను ఎంపిక చేయాలని స్పష్టం చేసింది. సీక్రెట్‌ […]

Advertisement
Update:2019-11-26 05:43 IST

మహారాష్ట్ర రాజకీయ పరిణామాలపై సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. రేపే బలపరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. ముగ్గురు జడ్జిల ఏకాభిప్రాయంతో తీర్పు వెలువరించారు. గవర్నర్‌ బీజేపీకి ఇచ్చిన గడువు కంటే మూడు రోజుల ముందే బలపరీక్ష నిర్వహించాలని సుప్రీం తీర్పు చెప్పింది.

బుధవారం సాయంత్రం 5లోపు బలపరీక్ష పూర్తి కావాలని సుప్రీం స్పష్టం చేసింది. ప్రొటెం స్పీకరే బలపరీక్ష నిర్వహిస్తారని సుప్రీం కోర్టు తన తీర్పులో చెప్పింది. తక్షణం ప్రొటెం స్పీకర్‌ను ఎంపిక చేయాలని స్పష్టం చేసింది.

సీక్రెట్‌ బ్యాలెట్‌లో బలపరీక్ష నిర్వహించాల్సిన అవసరం లేదని తీర్పు చెప్పింది. బలపరీక్ష ఘట్టం మొత్తం ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఆదేశించింది.

రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందని… కాబట్టి ఆలస్యం లేకుండా పక్రియ పూర్తి చేయాలని కోర్టు వ్యాఖ్యానించింది.

Tags:    
Advertisement

Similar News