సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా.... బలం లేదని వ్యాఖ్య
కేంద్ర ప్రభుత్వం, రాష్ట గవర్నర్ సహకారంతో సీఎంగా మెరుపు వేగంతో ప్రమాణస్వీకారం చేసిన ఫడ్నవీస్ రాజీనామా చేశారు. మూడు రోజులకే సీఎం పదవి ఊడిపోయింది. ఫడ్నవీస్‌తో పాటు ప్రమాణస్వీకారం చేసిన డిప్యూటీ సీఎం అజిత్ పవార్ రాజీనామా చేసిన వెంటనే ఫడ్నవీస్ కూడా తన రాజీనామా ప్రకటించారు. రాజీనామా అంశాన్ని మీడియా సమావేశం పెట్టి ప్రకటించిన ఫడ్నవీస్… శివసేనపై విరుచుకుపడ్డారు. ప్రజాతీర్పుకు శివసేన వెన్నుపోటు పొడిచిందని ఆరోపించారు. ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించిందని చెప్పారు. ఒకవైపు […]
కేంద్ర ప్రభుత్వం, రాష్ట గవర్నర్ సహకారంతో సీఎంగా మెరుపు వేగంతో ప్రమాణస్వీకారం చేసిన ఫడ్నవీస్ రాజీనామా చేశారు. మూడు రోజులకే సీఎం పదవి ఊడిపోయింది. ఫడ్నవీస్‌తో పాటు ప్రమాణస్వీకారం చేసిన డిప్యూటీ సీఎం అజిత్ పవార్ రాజీనామా చేసిన వెంటనే ఫడ్నవీస్ కూడా తన రాజీనామా ప్రకటించారు.
రాజీనామా అంశాన్ని మీడియా సమావేశం పెట్టి ప్రకటించిన ఫడ్నవీస్… శివసేనపై విరుచుకుపడ్డారు. ప్రజాతీర్పుకు శివసేన వెన్నుపోటు పొడిచిందని ఆరోపించారు. ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించిందని చెప్పారు. ఒకవైపు తమతో ఉంటూనే శివసేన ఇతర పార్టీలతో చర్చలు జరిపిందని ఆరోపించారు.
హిందుత్వాన్ని సోనియా గాంధీ కాళ్ల వద్ద శివసేన తాకట్టు పెట్టిందని ఆరోపించారు. ఎన్‌సీపీ ఎమ్మెల్యేల మద్దతుతో కూడిన లేఖను అజిత్ పవార్ తమకు ఇచ్చారని ఫడ్నవీస్ వివరించారు. ఫిరాయింపులను ప్రోత్సహించే తత్వం బీజేపీది కాదని చెప్పారు. శివసేన కూటమి ఏదో ఒకరోజు కూలిపోక తప్పదని ఫడ్నవీస్ హెచ్చరించారు.
ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సినంత బలం బీజేపీకి లేదన్న విషయం తమకు తెలుసన్నారు. ఫిరాయింపులను ప్రోత్సహించకూడదన్న ఉద్దేశంతోనే సీఎం పదవికి రాజీనామా చేసినట్టు చెప్పుకొచ్చారు. శివసేన కూటమి ఏర్పాటు చేసే ప్రభుత్వం మూడు చక్రాల బండి లాంటిదని ఫడ్నవీస్ వ్యాఖ్యానించారు.
రేపే బలనిరూపణ చేసుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశించడంతో మరో దారి లేఖ ఫడ్నవీస్ రాజీనామా చేశారు. శివసేన కూటమి వద్ద 162 మంది ఎమ్మెల్యేలు ఉండడం, వారితో శివసేన కూటమి బలప్రదర్శన చేయడం, అటు నుంచి ఎమ్మెల్యేలను లాగే అవకాశం ప్రస్తుతానికి లేకపోవడం, ఇంతలోనే సుప్రీం కోర్టు రేపే బలనిరూపణ చేసుకోవాలని ఫడ్నవీస్‌ను ఆదేశించడంతో బీజేపీ ఇరుకునపడింది. బలపరీక్షలో నెగ్గడం దాదాపు అసాధ్యమని నిర్ధారించుకున్న తర్వాత తొలుత అజిత్ పవార్‌తో, ఆ తర్వాత ఫడ్నవీస్‌తో బీజేపీ పెద్దలు రాజీనామా చేయించారు.
మహారాష్ట్రతో ఎదురైన చేదు అనుభవం అమిత్ షా, మోడీ నాయకత్వానికి కూడా ఇదో మచ్చగా మిగిలే అవకాశం ఉంది. హఠాత్తుగా ఫడ్నవీస్‌తో రాజ్‌భవన్‌లో సీఎంగా ప్రమాణస్వీకారం చేయించడంతో మీడియా మొత్తం అమిత్ షా చాణిక్యం, శివసేనపై సర్జికల్ స్ట్రైక్ అంటూ కితాబిచ్చాయి. కానీ బలపరీక్షకు ముందే బీజేపీ చేతులేత్తేసింది. బీజేపీ నాయకత్వం అభాసుపాలైంది. సిద్ధాంతాలపరంగా వాజ్‌పేయి కాలంతో పోలిస్తే… ఇప్పటి బీజేపీ పాతాలానికి దిగిజారిపోయిందన్న చెడ్డ పేరు మాత్రమే ఈ ప్రయత్నంతో… బీజేపీ సొంతం చేసుకుంది.