ఆవులకు చలికోటు " యోగి సర్కార్ కొత్త నిర్ణయం

పుట్ పాత్‌ మీద చలికి వణుకుతూ ఉన్న అనేక మంది పేదలను, దిక్కులేని వారిని చూస్తుంటాం. వారి సంగతేమో గానీ… ఉత్తరప్రదేశ్‌లో ఆవులకు మాత్రం మహర్దశ పట్టింది. చలికాలంలో ఆవులకు చలికోటు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత అయోధ్య నుంచి ఈ పని మొదలుపెడుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అయోధ్యలోని ఆవులకు చలికోటు ధరింపచేయబోతున్నట్టు అయోధ్య మున్సిపల్ కార్పొరేషన్‌ ప్రకటించింది. మూడు నాలుగు దశల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. తొలిదశలో బైసింగ్‌పూర్‌లోని గోశాలలో […]

Advertisement
Update:2019-11-25 17:38 IST

పుట్ పాత్‌ మీద చలికి వణుకుతూ ఉన్న అనేక మంది పేదలను, దిక్కులేని వారిని చూస్తుంటాం. వారి సంగతేమో గానీ… ఉత్తరప్రదేశ్‌లో ఆవులకు మాత్రం మహర్దశ పట్టింది. చలికాలంలో ఆవులకు చలికోటు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత అయోధ్య నుంచి ఈ పని మొదలుపెడుతున్నారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు అయోధ్యలోని ఆవులకు చలికోటు ధరింపచేయబోతున్నట్టు అయోధ్య మున్సిపల్ కార్పొరేషన్‌ ప్రకటించింది. మూడు నాలుగు దశల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

తొలిదశలో బైసింగ్‌పూర్‌లోని గోశాలలో ఉంటున్న 1200 ఆవులు, వాటి దూడలకు చలికోటులను అందించనున్నారు. ఇప్పటికే చలికోటుల కోసం ఆర్డర్ ఇచ్చినట్టు కమిషనర్‌ నీరజ్‌ శుక్లా వివరించారు.

ఒక్కో ఆవు కోటుకు 300 రూపాయలు చెల్లిస్తున్నారు. ఆవుల శరీరాలకు వెచ్చదనం ఉండేలా మూడు పొరల కోటులను సిద్ధం చేస్తున్నారు. ఆవు దూడలకు కూడా వీటిని ఏర్పాటు చేయబోతున్నారు.

Tags:    
Advertisement

Similar News