అవినీతి నిర్మూలన కోసం ఐఐఎంతో ఒప్పందం

అవినీతి నిర్మూలనలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ప్రభుత్వ శాఖల్లో వ్యవస్థీకృతమైన అవినీతిని నిర్మూలించేందుకు కొత్త ఆలోచనతో ముందుకెళ్తోంది. ఇందుకోసం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌-ఐఐఎంతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. లంచాలు తీసుకోవద్దని హెచ్చరించినా, ఏసీబీ దాడులు చేయించినా అధికారులు అవినీతికి దూరంగా ఉండలేకపోతున్నారు. ఈనేపథ్యంలో అసలు లంచాలు తీసుకునేందుకు అవకాశం లేని విధంగా వ్యవస్థను మార్చేందుకు ఏపీ ప్రభుత్వం- ఐఐఎం కలిసి పనిచేయబోతున్నాయి. ప్రభుత్వ శాఖల్లో అవినీతి సంగతి తేల్చేందుకు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌- ద […]

Advertisement
Update:2019-11-18 06:21 IST

అవినీతి నిర్మూలనలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ప్రభుత్వ శాఖల్లో వ్యవస్థీకృతమైన అవినీతిని నిర్మూలించేందుకు కొత్త ఆలోచనతో ముందుకెళ్తోంది. ఇందుకోసం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌-ఐఐఎంతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.

లంచాలు తీసుకోవద్దని హెచ్చరించినా, ఏసీబీ దాడులు చేయించినా అధికారులు అవినీతికి దూరంగా ఉండలేకపోతున్నారు. ఈనేపథ్యంలో అసలు లంచాలు తీసుకునేందుకు అవకాశం లేని విధంగా వ్యవస్థను మార్చేందుకు ఏపీ ప్రభుత్వం- ఐఐఎం కలిసి పనిచేయబోతున్నాయి.

ప్రభుత్వ శాఖల్లో అవినీతి సంగతి తేల్చేందుకు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌- ద ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్
ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా అహ్మదాబాద్ -ఐఐఎం ఏపీ ప్రభుత్వ శాఖల్లో అవినీతికి అవకాశం ఇస్తున్న అంశాలను అధ్యయనం చేస్తుంది.

ముఖ్యంగా రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ శాఖల్లో అవినీతి భారీగా ఉన్న నేపథ్యంలో ఆ శాఖలపై దృష్టిసారించనున్నారు. ఈ శాఖల్లోని వారు అవినీతి చేయడానికి అవకాశం కల్పిస్తున్న అంశాలను గుర్తిస్తారు.

అలా అవినీతికి, లంచాలకు అవకాశం ఇస్తున్న వ్యవహారాలను గుర్తించి అందుకు విరుగుడుగా ఏం చేయాలన్న దానిపై ఐఐఎం… ఏపీ ప్రభుత్వానికి సూచనలు ఇస్తుంది.

లంచాలు తీసుకోవద్దని ఎంతగా చెప్పినా, ఎన్ని ఏసీబీ దాడులు చేస్తున్నా కొందరు ఉద్యోగులు ఈ చెడు అలవాటునైతే మానుకోవడం లేదు. ఈ నేపథ్యంలో అసలు లంచాలు తీసుకునే అవకాశం లేని విధంగా పాలనా వ్యవస్థను రూపొందించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు.

కొన్ని శాఖల్లో వ్యవస్థీకృతమైన అవినీతికి చెక్‌ పెట్టడంతో పాటు లంచాలు తీసుకునే అవకాశం లేని విధంగా వ్యవస్థను రూపొందించేందుకు ఈ ఒప్పందం చేసుకున్నట్టు ఏపీ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు.

Tags:    
Advertisement

Similar News