రాజేందప్రసాద్ అలక.... దిగి వచ్చిన బోడే ప్రసాద్
టీడీపీకి రాజీనామా చేసిన వల్లభనేని వంశీని ఒక పట్టుపట్టాలన్న ఉద్దేశంతో ఒక చానల్ చర్చా కార్యక్రమానికి వచ్చిన టీడీపీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రపసాద్‌కు ప్రతికూల పరిస్థితి ఎదురైంది. చర్చా కార్యక్రమంలో రాజేంద్రప్రసాద్‌ను వల్లభనేని వంశీ మాటలతో చితక్కొట్టారు. వంశీ వాడిన కొన్ని ఘాటు పదాల దెబ్బకు రాజేంద్రప్రసాద్ బిత్తరపోయాడు. అదే సమయంలో బాబు రాజేంద్రప్రసాద్.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ నుంచి డబ్బులు తీసుకున్నారని వంశీ ఆరోపించారు. వంశీ తనను ఇష్టానుసారం తిట్టినా పార్టీ స్పందించకపోవడంతో […]
టీడీపీకి రాజీనామా చేసిన వల్లభనేని వంశీని ఒక పట్టుపట్టాలన్న ఉద్దేశంతో ఒక చానల్ చర్చా కార్యక్రమానికి వచ్చిన టీడీపీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రపసాద్‌కు ప్రతికూల పరిస్థితి ఎదురైంది.
చర్చా కార్యక్రమంలో రాజేంద్రప్రసాద్‌ను వల్లభనేని వంశీ మాటలతో చితక్కొట్టారు. వంశీ వాడిన కొన్ని ఘాటు పదాల దెబ్బకు రాజేంద్రప్రసాద్ బిత్తరపోయాడు. అదే సమయంలో బాబు రాజేంద్రప్రసాద్.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ నుంచి డబ్బులు తీసుకున్నారని వంశీ ఆరోపించారు.
వంశీ తనను ఇష్టానుసారం తిట్టినా పార్టీ స్పందించకపోవడంతో బాబు రాజేంద్రప్రసాద్ నొచ్చుకున్నారు. బోడే ప్రసాద్ నుంచి డబ్బులు తీసుకున్నట్టు తనపై వంశీ చేసిన ఆరోపణలను బోడే ప్రసాద్ ఖండించకపోవడంతో రాజేంద్రప్రసాద్ అలకబూనారు. ఇకపై తనకు పూర్తి అండగా ఉంటామని పార్టీ నాయకత్వం హామీ ఇస్తేనే చర్చల్లో పాల్గొంటానని రాజేంద్రప్రసాద్ తేల్చేశారు.
వంశీ చేసిన ఆరోపణలను బోడే ప్రసాద్ మాట వరుసకు కూడా ఖండించకపోవడాన్ని రాజేంద్రప్రసాద్ చాలా సీరియస్‌గా తీసుకున్నారు. రాజేంద్రప్రసాద్ అలక పూనడంతో టీడీపీ నాయకత్వం స్పందించింది. బోడే ప్రసాద్‌ను రాజేంద్రప్రసాద్ వద్దకు పంపించింది. రాజేంద్రప్రసాద్‌కు డబ్బులు ఇచ్చినట్టు వంశీ చేసిన ఆరోపణలను పార్టీ నాయకత్వం సూచన మేరకు బోడే ప్రసాద్ ఖండించారు. తాను రాజేంద్రప్రసాద్‌కు డబ్బులు ఇవ్వలేదని, వంశీ ఆరోపణలు అవాస్తవమని బోడే వివరించారు.