మహారాష్ట్రలో కుదిరిన ఒప్పందం

మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ల మధ్య ఒప్పందం కుదిరింది. ప్రభుత్వ ఏర్పాటుకు మూడు పార్టీలు ఉమ్మడి ప్రణాళికను సిద్ధం చేసుకున్నాయి. పదవుల పంపకంపైనా స్పష్టత వచ్చింది. ముఖ్యమంత్రి పదవిని ఐదేళ్ల పాటు శివసేనకు అప్పగించేందుకు ఎన్సీపీ, కాంగ్రెస్ అంగీకరించాయి. ఇందుకు ప్రతిగా ఎన్‌సీపీకి శాసనమండలి చైర్మన్ పదవితో పాటు, డిప్యూటీ సీఎం, 14 మంత్రి పదవులు ఇచ్చేందుకు శివసేన అంగీకరించింది. కాంగ్రెస్‌కు స్పీకర్‌ పదవితో పాటు డిప్యూటీ సీఎం పదవి, 12 మంత్రి పదవులు ఇవ్వనున్నారు. […]

Advertisement
Update:2019-11-15 06:41 IST

మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ల మధ్య ఒప్పందం కుదిరింది. ప్రభుత్వ ఏర్పాటుకు మూడు పార్టీలు ఉమ్మడి ప్రణాళికను సిద్ధం చేసుకున్నాయి. పదవుల పంపకంపైనా స్పష్టత వచ్చింది. ముఖ్యమంత్రి పదవిని ఐదేళ్ల పాటు శివసేనకు అప్పగించేందుకు ఎన్సీపీ, కాంగ్రెస్ అంగీకరించాయి.

ఇందుకు ప్రతిగా ఎన్‌సీపీకి శాసనమండలి చైర్మన్ పదవితో పాటు, డిప్యూటీ సీఎం, 14 మంత్రి పదవులు ఇచ్చేందుకు శివసేన అంగీకరించింది. కాంగ్రెస్‌కు స్పీకర్‌ పదవితో పాటు డిప్యూటీ సీఎం పదవి, 12 మంత్రి పదవులు ఇవ్వనున్నారు.

శివసేనకు ముఖ్యమంత్రి పదవి ఐదేళ్ల పాటు ఇస్తున్నట్టు కాంగ్రెస్‌, ఎన్‌సీపీ నేతలు ప్రకటించారు. హోం, ఆర్థిక, రెవెన్యూ వంటి కీలక పదవులను మిత్రపక్షాలైన తమకే కేటాయించాలని కాంగ్రెస్, ఎన్‌సీపీ పట్టుపడుతోంది.

ఈనెల 17న మూడు పార్టీల నేతలు సోనియా గాంధీని కలవనున్నారు. ఆ తర్వాత మూడు పార్టీల నేతలు సంయుక్తంగా గవర్నర్‌ను కలవనున్నారు.

Tags:    
Advertisement

Similar News