బడుగులు, బీసీలు, పేద విద్యార్థులకు ఇంగ్లీష్ చదువు అందాలి... అందుకే ఆంగ్ల బోధన...

ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంపై కొందరు మేధావులు, కొన్ని పత్రికలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తెలుగు భాషను చంపేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. అయితే ఇలా ప్రశ్నిస్తున్న వారి కుమారులు, మనవళ్లు, మనవరాళ్లు అంతా కార్పొరేట్ స్కూళ్లల్లో ఇంగ్లీష్ మీడియం చదువుతున్న వారే. అలాంటి వారు ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమ పిల్లలకు ఇంగ్లీష్ చదువులు అందిస్తూనే… ప్రభుత్వ పాఠశాలకు వచ్చే సరికి ఆంగ్లం అక్కర్లేదు అంటూ వాదిస్తున్నారు. […]

Advertisement
Update:2019-11-08 03:01 IST

ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంపై కొందరు మేధావులు, కొన్ని పత్రికలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తెలుగు భాషను చంపేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. అయితే ఇలా ప్రశ్నిస్తున్న వారి కుమారులు, మనవళ్లు, మనవరాళ్లు అంతా కార్పొరేట్ స్కూళ్లల్లో ఇంగ్లీష్ మీడియం చదువుతున్న వారే.

అలాంటి వారు ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమ పిల్లలకు ఇంగ్లీష్ చదువులు అందిస్తూనే… ప్రభుత్వ పాఠశాలకు వచ్చే సరికి ఆంగ్లం అక్కర్లేదు అంటూ వాదిస్తున్నారు.

ప్రభుత్వ పాఠశాలకు పిల్లలను పంపిస్తున్న తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లలకూ ఇంగ్లీష్ బోధన అందుతుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంగ్లీష్ లో ప్రావిణ్యం సాధిస్తే భవిష్యత్తులో ప్రపంచంలో ఎక్కడైనా తమ పిల్లలు నెట్టుకురాగలుగుతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఏపీలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడాన్ని రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ సమర్ధించారు. ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం అంటే తెలుగును దూరం చేయడం ఎలా అవుతుందని ప్రశ్నించారు. బడుగు, బలహీన వర్గాల ప్రజల ఆకాంక్ష మేరకే ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చిందన్నారు.

జగన్‌ మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో అనేక మంది బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారు, పేద ప్రజలు ఆయన్ను కలిసి తమ పిల్లలకు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువులు అందించాలని కోరారని… ప్రజల ఆకాంక్ష మేరకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు.

తాను ఇప్పటికీ, ఎప్పటికీ తెలుగు మాతృభాష ప్రేమికుడినేనని… ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం వల్ల తెలుగు దూరం అవుతుందన్న వాదనతో తాను ఏకీభవించనన్నారు. ఒకటి నుంచి 10వ తరగతి వరకు తెలుగు గానీ, ఉర్దునూ గానీ తప్పనిసరి సబ్జెట్‌గా చేస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నందుకు తాను కృతజ్ఞతలు తెలుపుతున్నానని యార్లగడ్డ చెప్పారు.

Tags:    
Advertisement

Similar News