ఫడ్నవీస్‌ రాజీనామా

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు అంశం కొలిక్కిరాలేదు. సీఎం పదవి విషయంలో శివసేన వెనక్కు తగ్గకపోవడంతో బీజేపీ దిక్కుతోచని స్థితిలో పడింది. నేటి అర్థరాత్రితో మహారాష్ట్ర అసెంబ్లీ కాలం కూడా ముగుస్తోంది. దాంతో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్‌ను కలిసి రాజీనామా అందజేశారు. శివసేనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకుండానే ఆ పార్టీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీ భావించింది. కానీ శివసేన అందుకు అంగీకరించలేదు. చెరో రెండున్నరేళ్ల పాటు సీఎం పదవిని పంచుకోవాల్సిందే […]

Advertisement
Update:2019-11-08 11:45 IST

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు అంశం కొలిక్కిరాలేదు. సీఎం పదవి విషయంలో శివసేన వెనక్కు తగ్గకపోవడంతో బీజేపీ దిక్కుతోచని స్థితిలో పడింది. నేటి అర్థరాత్రితో మహారాష్ట్ర అసెంబ్లీ కాలం కూడా ముగుస్తోంది. దాంతో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్‌ను కలిసి రాజీనామా అందజేశారు.

శివసేనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకుండానే ఆ పార్టీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీ భావించింది. కానీ శివసేన అందుకు అంగీకరించలేదు. చెరో రెండున్నరేళ్ల పాటు సీఎం పదవిని పంచుకోవాల్సిందే అని పట్టుపట్టింది. తమ ఎమ్మెల్యేలను బీజేపీ తీసుకెళ్లే అవకాశం ఉందన్న భావనతోనే వారిని హోటల్‌కు తరలించింది.

ఇప్పుడు గవర్నర్‌ నిర్ణయంపై ఆసక్తి నెలకొంది. రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేసే అవకాశం కూడా ఉందని భావిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News