ఆజాద్‌కు హైద‌రాబాద్‌లో ఏం ప‌ని?

తెలంగాణ కాంగ్రెస్ గ్రూపులుగా వీడిపోయింది. సీనియ‌ర్స్, జూనియ‌ర్స్ మ‌ధ్య ఫైట్ న‌డుస్తోంది. పీసీసీ చీఫ్ ప‌ద‌వి కోసం సీనియ‌ర్లు, జూనియ‌ర్లు తెగ ట్రై చేస్తున్నారు. వ‌రుస ఓట‌ముల‌తో పార్టీ డీలా ప‌డింది. పార్టీని న‌డిపే నేత కోసం కేడ‌ర్ వెయిట్ చేస్తోంది. ఇటీవ‌ల హ‌ర్యానా, మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల ఫలితాల‌తో పార్టీలో కొంత ఊపు వ‌చ్చింది. పార్టీ బ‌లంగా ఉన్న రాష్ట్రాల్లో మరింత బ‌లోపేతం చేయడం కోసం సోనియా గాంధీ ఫోక‌స్ పెట్టిన‌ట్లు స‌మాచారం. తెలంగాణ‌లో మూడు ఎంపీ […]

Advertisement
Update:2019-11-06 10:50 IST

తెలంగాణ కాంగ్రెస్ గ్రూపులుగా వీడిపోయింది. సీనియ‌ర్స్, జూనియ‌ర్స్ మ‌ధ్య ఫైట్ న‌డుస్తోంది. పీసీసీ చీఫ్ ప‌ద‌వి కోసం సీనియ‌ర్లు, జూనియ‌ర్లు తెగ ట్రై చేస్తున్నారు.

వ‌రుస ఓట‌ముల‌తో పార్టీ డీలా ప‌డింది. పార్టీని న‌డిపే నేత కోసం కేడ‌ర్ వెయిట్ చేస్తోంది. ఇటీవ‌ల హ‌ర్యానా, మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల ఫలితాల‌తో పార్టీలో కొంత ఊపు వ‌చ్చింది. పార్టీ బ‌లంగా ఉన్న రాష్ట్రాల్లో మరింత బ‌లోపేతం చేయడం కోసం సోనియా గాంధీ ఫోక‌స్ పెట్టిన‌ట్లు స‌మాచారం.

తెలంగాణ‌లో మూడు ఎంపీ సీట్ల‌ను కాంగ్రెస్ గెలుచుకుంది. మిగ‌తా స్థానాల్లో చెప్పుకోద‌గ్గ ఓట్ల శాతం సంపాదించింది. ఇక్క‌డ పార్టీ బ‌లోపేతానికి చాన్స్ ఉంది. సోనియా పార్టీ బ‌లోపేతానికి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై దృష్టి పెట్టిన‌ట్లు తెలుస్తోంది.

కొత్త పీసీసీ చీఫ్‌ ఎంపిక‌పై సోనియా దృష్టి పెట్టారు. పీసీసీ చీఫ్ పదవి ఎవ‌రికి ఇవ్వాలి? అంద‌రినీ క‌లుపుకుపోయే నేత ఎవ‌రు? ప‌్ర‌స్తుత ప‌రిస్థితుల్లో పార్టీకి ఎవ‌రి నాయ‌క‌త్వం అవ‌స‌రం అనే డిటైల్స్‌ను సోనియా సేక‌రించార‌ని స‌మాచారం.

అయితే క్షేత్ర‌స్థాయిలో ఏం జ‌రుగుతుందో తెలుసుకునేందుకు సోనియా దూత గులాం న‌బీ ఆజాద్ హైద‌రాబాద్ వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న రిపోర్టు ఆధారంగానే కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక ఉంటుంద‌ని తెలుస్తోంది.

ఆజాద్‌కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఆయ‌న మాట‌పై సోనియాకు న‌మ్మ‌కం ఉంది. ఇక్క‌డ ప‌రిస్థితులు పూర్తిగా తెలిసిన ఆజాద్‌ను సోనియా పంపించిన‌ట్లు గాంధీభ‌వ‌న్ లో గుస‌గుస‌లు విన్పిస్తున్నాయి.

సోనియా ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత హ‌ర్యానా, మ‌హారాష్ట్ర‌లో మంచి ఫ‌లితాలు వ‌చ్చాయి. దీంతో త‌మ‌కు ప‌ట్టు ఉన్న రాష్ట్రాల్లో పాగా వేసేందుకు సోనియా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని తెలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News