ఏపీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంను ఆకస్మికంగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనను గుంటూరు జిల్లా బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డైరెక్టర్ జనరల్‌గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువరించింది. కాగా, ఈ బదిలీ ఉత్తర్వులు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ పేరుతో విడుదల అయ్యాయి. తన బాధ్యతలను తక్షణమే సీసీఎల్ఏకు అప్పగించి.. బదిలీ అయిన చోట రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఎల్వీ సుబ్రహ్మణ్యంకు ఇంకో […]

Advertisement
Update:2019-11-04 11:00 IST

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంను ఆకస్మికంగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనను గుంటూరు జిల్లా బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డైరెక్టర్ జనరల్‌గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువరించింది.

కాగా, ఈ బదిలీ ఉత్తర్వులు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ పేరుతో విడుదల అయ్యాయి. తన బాధ్యతలను తక్షణమే సీసీఎల్ఏకు అప్పగించి.. బదిలీ అయిన చోట రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఎల్వీ సుబ్రహ్మణ్యంకు ఇంకో ఐదు నెలలు సర్వీసు ఉండగానే ఇలా బదిలీ చేయడం ప్రభుత్వ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యింది.

ఇటీవల సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ సర్వీస్ రూల్స్ మారుస్తూ ఒక జీవో జారీ చేశారు. తనకు తెలియకుండా ఎలా ఈ జీవో ఇస్తారని ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం.. ప్రవీణ్ ప్రకాష్ కు నోటీసులు జారీ చేశారు. వెంటనే దీనిపై వివరణ ఇవ్వాలని కూడా కోరారు. కాని ఇంతలోనే సీఎస్‌ను బదిలీ చేస్తూ ప్రవీణ్ ప్రకాష్ పేరుతో ఉత్తర్వులు జారీ కావడం విశేషం.

తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నిరభ్ కుమార్ ని ప్రభుత్వం నియమించింది. నీరబ్ కుమార్ ప్రస్తుతం సీసీఎల్ఏ లో విధులు నిర్వహిస్తున్నారు.

కొత్త సీఎస్ రేసులో 1984 బ్యాచ్ కు చెందిన నీలమ్ సహనీ, సమీర్ శర్మ ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News