నేడే జనసేన-టీడీపీ సంయుక్త ప్రదర్శన... బాబు నుంచి టీడీపీ నేతలకు ఆదేశాలు
ఇసుక కొరతకు నిరసనగా విశాఖలో నేడు జనసేన లాంగ్ మార్చ్ నిర్వహించనుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జనసేన, టీడీపీ నేతలు రంగంలోకి దిగారు. పవన్ కల్యాణ్ ఫోన్ చేసి మద్దతు కోరడం, చంద్రబాబు వెంటనే అంగీకరించడం ఇదివరకే జరిగిపోయింది. పవన్ కల్యాణ్ లాంగ్ మార్చ్‌ను విజయవంతం చేయడం ద్వారా ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందన్న భావన కలిగించాలన్న ఆలోచనతో ఉన్న చంద్రబాబు… టీడీపీ అగ్రనేతలను ఇప్పటికే పురమాయించారు. మధ్యాహ్నం మూడు గంటలకు జరిగే లాంగ్ మార్చ్‌కు జనాన్ని […]
ఇసుక కొరతకు నిరసనగా విశాఖలో నేడు జనసేన లాంగ్ మార్చ్ నిర్వహించనుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జనసేన, టీడీపీ నేతలు రంగంలోకి దిగారు. పవన్ కల్యాణ్ ఫోన్ చేసి మద్దతు కోరడం, చంద్రబాబు వెంటనే అంగీకరించడం ఇదివరకే జరిగిపోయింది. పవన్ కల్యాణ్ లాంగ్ మార్చ్‌ను విజయవంతం చేయడం ద్వారా ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందన్న భావన కలిగించాలన్న ఆలోచనతో ఉన్న చంద్రబాబు… టీడీపీ అగ్రనేతలను ఇప్పటికే పురమాయించారు.
మధ్యాహ్నం మూడు గంటలకు జరిగే లాంగ్ మార్చ్‌కు జనాన్ని తరలించే బాధ్యతను విశాఖ చుట్టుపక్కల ఉన్న టీడీపీ నేతలు తమ భుజాన వేసుకున్నారు. లాంగ్ మార్చ్‌కు దూరంగా ఉంటామని బీజేపీ, వామపక్షాలు, కాంగ్రెస్ ప్రకటించిన నేపథ్యంలో…పవన్ కల్యాణ్‌కు టీడీపీ పూర్తి మద్దతు తెలిపింది.
లాంగ్ మార్చ్‌లో నేరుగా పాల్గొనాల్సిందిగా అచ్చెన్నాయుడు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాస్‌రావుకు చంద్రబాబు నుంచి ఆదేశాలు వెళ్లాయి. గంటా శ్రీనివాస్ రావు ను రప్పించడం కోసం జనసేన నాయకులు వ్యక్తిగతంగానూ ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎన్నికల ముందు వరకు పవన్ కల్యాణ్‌కు అండగా నిలబడుతూ వచ్చిన వామపక్ష పార్టీలు పవన్ కల్యాణ్‌కు హ్యాండ్ ఇచ్చాయి. బీజేపీతోనూ కలిసి పనిచేసేందుకు పవన్ కల్యాణ్ సిద్దమవడం బట్టి ఆయన విధానం ఏంటో అర్థమవుతోందని అందుకే తాము లాంగ్ మార్చ్‌లో పాల్గొనడం లేదంటూ వామపక్షాలు ప్రకటించాయి.
తమ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో తాము గందరగోళ పరిస్థితుల్లో ఉన్నామని… అందుకే లాంగ్ మార్చ్‌లో పాల్గొనడం లేదని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ప్రకటించారు.
ఇలా పవన్ కల్యాణ్ తీరుపై అనుమానంతో అన్ని పార్టీలు ఆయన మార్చ్‌కు దూరంగా ఉండగా… చంద్రబాబు, టీడీపీ ఇప్పుడు లాంగ్ మార్చ్‌కు అండగా నిలిచే బాధ్యతను తమ భుజాల మీద వేసుకున్నాయి.