జాతీయ మీడియాకు ఎల్లో ప్యాకేజీలు !
ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు కాలేదు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను జగన్ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వెళుతున్నారు. ఒక్కో పథకానికి ఒక్కో డేట్ పెట్టుకుంటూ అమల్లోకి తీసుకొస్తున్నారు. గ్రామాల్లో పథకం లబ్ధిదారులు హాయిగా ఉన్నారు. వానలు పడడంతో ప్రజలు వ్యవసాయ పనులు చూసుకుంటున్నారు. ప్రతిపక్ష తెలుగుదేశం మాత్రం కొత్త కుట్రలకు తెరలేపుతోంది. తమకు అలవాటైన గొబెల్ ప్రచారాన్ని మొదలుపెట్టింది. ఎల్లో మీడియా ప్రచారానికి విలువ ఉండడం లేదు. చాలా మంది జనం నమ్మడం లేదు. […]
ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు కాలేదు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను జగన్ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వెళుతున్నారు. ఒక్కో పథకానికి ఒక్కో డేట్ పెట్టుకుంటూ అమల్లోకి తీసుకొస్తున్నారు. గ్రామాల్లో పథకం లబ్ధిదారులు హాయిగా ఉన్నారు. వానలు పడడంతో ప్రజలు వ్యవసాయ పనులు చూసుకుంటున్నారు.
ప్రతిపక్ష తెలుగుదేశం మాత్రం కొత్త కుట్రలకు తెరలేపుతోంది. తమకు అలవాటైన గొబెల్ ప్రచారాన్ని మొదలుపెట్టింది. ఎల్లో మీడియా ప్రచారానికి విలువ ఉండడం లేదు. చాలా మంది జనం నమ్మడం లేదు. దీంతో ఇప్పుడు జాతీయ మీడియాను వేదికగా చేసుకోవాలని చంద్రబాబు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు.
ప్రతి వీకెండ్‌కు హైదరాబాద్‌కు వస్తున్న చంద్రబాబు…ఈ మధ్య మీటింగ్‌లు తెగ పెడుతున్నారు. దీపావళి పండుగకు రెండు రోజుల ముందు జాతీయ మీడియా ప్రతినిధులతో చంద్రబాబు ప్రత్యేక సమావేశం కావడం ఇప్పుడు కొత్త కుట్రకు కారణాలు గా తెలుస్తోంది. ప్రతి శుక్రవారం రాత్రి హైదరాబాద్ లో మకాం వేస్తోన్న మాజీ సీఎం చంద్ర బాబు తన నివాసం లో అర్థరాత్రి భేటీలతో జాతీయ చానెల్స్ ను కూడా తన ఎల్లో కోటరీలోకి మార్చుకుంటున్న వైనం ఆసక్తి గా మారింది.
పలు అంశాలపై ఏపీ సర్కారుకు వ్యతిరేకంగా… టీడిపి కి అనుకూలంగా ప్రసారాలు చేయాలని ఈ మీటింగ్‌లో చంద్రబాబు కోరారట. పవన్ కళ్యాణ్ విశాఖపట్నం ఇసుక ధర్నాకు హైదరాబాద్ నుండి జాతీయ మీడియా తీసుకురావాలని మీడియాలో కీలకవ్యక్తికి చంద్రబాబు బాధ్యతలు అప్పజెప్పినట్లు తెలుస్తోంది.
జాతీయ జెండా రంగుల వివాదం తో పాటు, ఇసుక, అమరావతి, పరిశ్రమల తరలింపు వంటి అంశాలపై వ్యతిరేక కథనాల ప్రసారాలకు జాతీయ చానెళ్ల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారని తెలుస్తోంది.
టీడిపి అధినేత భేటీ తర్వాత మూడు చానెళ్ల ప్రతినిధులు ప్రత్యేక కథనాలు ప్రసారాలు చేశారు. ప్రతి నెలా హైదరాబాద్ లోని తన నివాసం లో కలుద్దామని జాతీయ చానెళ్ల ప్రతినిధులను టీడీపీ అధినేత కోరినట్లు ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే తెలుగు చానెల్స్ యాజమాన్యాలతో పూర్తైన సంప్రదింపులు, పార్టీ తరపున చానెల్స్ కు ప్రత్యేక నిధులు కేటాయించారు. జాతీయ మీడియాకు దీపావళి మీటింగ్‌లో ప్యాకేజీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
మరోవైపు దీపావళి కానుకల పేరిట జాతీయ మీడియా ప్రతినిధులకు భారీ గిప్ట్‌లు కూడా ఇచ్చారట. మొత్తానికి రోజుకో ఫోటో..వారానికో ఐటమ్ అంటూ మీడియా ప్రతినిధులకు ప్యాకేజీ ఇచ్చారట.
చంద్రబాబు హైదరాబాద్ కుట్రలు తెలిసిన ప్రభుత్వం ఇక్కడ నిఘా పెట్టినట్లు సమాచారం.