బంగారంపై మోడీ సర్జికల్ స్ట్రైక్

పెద్ద నోట్ల రద్దు తర్వాత మోడీ ప్రభుత్వం మరో కీలకమైన చర్యకు సిద్ధమవుతోంది. ఈ సారి బంగారు నిల్వలపై దాడి చేయబోతోంది. ఇందుకోసం ఒక ప్రత్యేక పథకాన్ని కేంద్రం రూపొందిస్తోంది. ఈ మేరకు కేంద్రం లీకులు వదిలింది. పెద్దనోట్ల రద్దు తర్వాత దేశంలో బడాబాబులు తమ నల్ల ధనంతో భారీగా భూములు, బంగారం కొనుగోలు చేస్తున్నారు. దేశంలో భారీగా బంగారం లాకర్లకు పరిమితమవుతోంది. దీంతో దేశం ఏటా 900 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. దీని వల్ల […]

Advertisement
Update:2019-10-30 15:36 IST

పెద్ద నోట్ల రద్దు తర్వాత మోడీ ప్రభుత్వం మరో కీలకమైన చర్యకు సిద్ధమవుతోంది. ఈ సారి బంగారు నిల్వలపై దాడి చేయబోతోంది. ఇందుకోసం ఒక ప్రత్యేక పథకాన్ని కేంద్రం రూపొందిస్తోంది. ఈ మేరకు కేంద్రం లీకులు వదిలింది.

పెద్దనోట్ల రద్దు తర్వాత దేశంలో బడాబాబులు తమ నల్ల ధనంతో భారీగా భూములు, బంగారం కొనుగోలు చేస్తున్నారు. దేశంలో భారీగా బంగారం లాకర్లకు పరిమితమవుతోంది. దీంతో దేశం ఏటా 900 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. దీని వల్ల విదేశీ మారక ద్రవ్యం ఖర్చు అవుతోంది. బంగారం మాత్రం నిరర్ధకంగా ఉండిపోతోంది.

ఈ నేపథ్యంలో కేంద్రం కొత్త ప్రణాళికను సిద్ధం చేస్తోంది. లెక్క లేని బంగారాన్ని వెల్లడించేందుకు అవకాశం కల్పించబోతోంది. నిర్ణీత గడువు విధించి ఆలోగా బంగారం నిల్వలను వెల్లడించేందుకు అవకాశం ఇస్తుంది. ప్రభుత్వం నిర్ధేశించిన పన్ను కట్టి బంగారాన్ని ఉంచుకోవచ్చు. పథకం గడువు తీరిన తర్వాత ప్రభుత్వం అక్రమ బంగారం నిల్వలపై దాడులు చేయవచ్చు. బ్యాంకు లాకర్లను తెరిచి తనిఖీ చేయవచ్చు.

అధిక బంగారం దాచిన వారిపై భారీగా పన్ను వేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కేంద్రం బంగారంపై దాడి చేయబోతోందన్న వార్తలు బంగారం వ్యాపారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. కొత్తగా బంగారం కొనుగోళ్లు భారీగా పడిపోతాయని భయపడుతున్నారు.

Tags:    
Advertisement

Similar News