మోడీ వెనకడుగు వేయబోతున్నారా?

‘ఒకే దేశం-ఒకేసారి ఎన్నికలు’ పేరుతో జమిలి ఎన్నికలు ప్లాన్ చేస్తున్న బీజేపీ పెద్దలకు ఇప్పుడు ఐదు నెలలకే వచ్చిన మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు డోలాయమానంలో పడేశాయి. 2023లోనే దేశంలోని అన్ని రాష్ట్రాలకు, కేంద్రంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని మోడీ యోచిస్తున్నారు. దీనికోసం ఇప్పటికే రంగం సిద్ధం చేశారు. మధ్యలో ఆగిపోయే ప్రభుత్వాలను పొడిగించడం.. కొన్ని రాష్ట్రాలకు ముందస్తు ఎన్నికలు జరిపేందుకు మోడీ రాజ్యాంగ సవరణకు ప్రణాళికలు వేస్తున్నారు. అయితే రెండు రాష్ట్రాల ఎన్నికల్లో హర్యానాలో హంగ్ […]

Advertisement
Update:2019-10-28 12:30 IST

‘ఒకే దేశం-ఒకేసారి ఎన్నికలు’ పేరుతో జమిలి ఎన్నికలు ప్లాన్ చేస్తున్న బీజేపీ పెద్దలకు ఇప్పుడు ఐదు నెలలకే వచ్చిన మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు డోలాయమానంలో పడేశాయి.

2023లోనే దేశంలోని అన్ని రాష్ట్రాలకు, కేంద్రంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని మోడీ యోచిస్తున్నారు. దీనికోసం ఇప్పటికే రంగం సిద్ధం చేశారు.

మధ్యలో ఆగిపోయే ప్రభుత్వాలను పొడిగించడం.. కొన్ని రాష్ట్రాలకు ముందస్తు ఎన్నికలు జరిపేందుకు మోడీ రాజ్యాంగ సవరణకు ప్రణాళికలు వేస్తున్నారు.

అయితే రెండు రాష్ట్రాల ఎన్నికల్లో హర్యానాలో హంగ్ రావడం.. మహారాష్టలో 100 సీట్లకే పరిమితమవ్వడం చూశాక బీజేపీ నేతల్లో అంతర్మథనం మొదలైనట్టు కనిపిస్తోంది. అధికారం చేపట్టిన 5 నెలల్లోనే వచ్చిన ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయడం అటుంచి కనీసం సొంతంగా అధికారంలోకి కూడా రాలేని దుస్థితిలో పడిపోవడంతో కమలనాథులు జమిలిపై ఆలోచిస్తున్నారట.

2019 సార్వత్రిక ఎన్నికలకు, మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ఏకంగా 9శాతం ఓటు బ్యాంకు తగ్గడం చూస్తే బీజేపీ వ్యతిరేకత చాలా పెరిగిందని తేలింది. మరి 2023లోనే ఎన్నికలకు వెళితే బీజేపీ పుట్టి మునగవచ్చన్న ఆందోళన వారిని పట్టి పీడిస్తోంది.

రాబోయే అసెంబ్లీ ఎన్నికలు చూశాక కేంద్రంలోని బీజేపీ పెద్దలు జమిలికి వెళదామా లేదా అన్నది డిసైడ్ చేస్తారని సమచారం. ఇలా అసెంబ్లీ ఎన్నికల దెబ్బకు బీజేపీ జమిలిపై పునరాలోచనలో పడిపోయింది.

Tags:    
Advertisement

Similar News