భారత టీ-20జట్టులో అగ్గిపిడుగులు

సంజు శాంసన్, శివం దూబే ఇద్దరూ ఇద్దరే బంగ్లాదేశ్ తో నవంబర్ 3నుంచి జరిగే తీన్మార్ టీ-20 సిరీస్ లో పాల్గొనే భారతజట్టులో…అగ్గిపిడుగుల్లాంటి ఇద్దరు ఆటగాళ్లు చోటు సంపాదించారు. కేరళ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ సంజు శాంసన్ నాలుగేళ్ల తర్వాత భారతజట్టులో తిరిగి చోటు సంపాదించాడు. మరోవైపు ముంబై డాషింగ్ ఆల్ రౌండర్ శివం దూబే తొలిసారిగా జట్టులో స్థానం సంపాదించాడు. ద్రావిడ్ శిష్యుడు సంజు శాంసన్… ధూమ్ ధామ్ టీ-20, ఇన్ స్టంట్ వన్డే క్రికెట్లో […]

Advertisement
Update:2019-10-26 01:30 IST
  • సంజు శాంసన్, శివం దూబే ఇద్దరూ ఇద్దరే

బంగ్లాదేశ్ తో నవంబర్ 3నుంచి జరిగే తీన్మార్ టీ-20 సిరీస్ లో పాల్గొనే భారతజట్టులో…అగ్గిపిడుగుల్లాంటి ఇద్దరు ఆటగాళ్లు చోటు సంపాదించారు.

కేరళ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ సంజు శాంసన్ నాలుగేళ్ల తర్వాత భారతజట్టులో తిరిగి చోటు సంపాదించాడు. మరోవైపు ముంబై డాషింగ్ ఆల్ రౌండర్ శివం దూబే తొలిసారిగా జట్టులో స్థానం సంపాదించాడు.

ద్రావిడ్ శిష్యుడు సంజు శాంసన్…

ధూమ్ ధామ్ టీ-20, ఇన్ స్టంట్ వన్డే క్రికెట్లో భారీ షాట్లతో విరుచుకుపడే యువఆటగాళ్ల వరుసలో కేరళ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ సంజు శాంసన్ అందరికంటే ముందు వరుసలో ఉంటాడు.

భారత మాజీ కెప్టెన్, జాతీయ క్రికెట్ అకాడమీ ప్రస్తుత డైరెక్టర్ రాహుల్ ద్రావిడ్ శిక్షణలో రాటు దేలిన సంజు శాంసన్… రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో సభ్యుడిగా తన బ్యాట్ పవర్ ఏపాటిదో ఐపీఎల్ ద్వారా ప్రపంచానికి చాటి చెప్పాడు.

నాలుగేళ్ల క్రితం జింబాబ్వే పర్యటనకు వెళ్లిన భారతజట్టులో తొలిసారిగా చోటు సంపాదించిన సంజు స్థాయికి తగ్గట్టుగా ఆడలేకపోయాడు. ఆ తర్వాత నుంచి సెలెక్టర్లు.. సంజును పక్కన పెట్టారు.

నాలుగేళ్ల తర్వాత….

గత నాలుగేళ్లుగా దేశవాళీ, ఐపీఎల్, ఇండియా- ఏ జట్ల తరపున నిలకడగా రాణిస్తూ వచ్చిన సంజూ…విజయ్ హజారే ట్రోఫీ లీగ్ మ్యాచ్ లో చత్తిస్ గఢ్ పై మెరుపు డబుల్ సెంచరీ సాధించడం ద్వారా సెలెక్టర్ల దృష్టిని ఆకట్టుకొన్నాడు.

నాలుగు సంవత్సరాల విరామం తర్వాత తిరిగి భారతజట్టులో చోటు దక్కడంతో సంజు శాంసన్ పొంగిపోతున్నాడు. గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని.. జట్టు అవసరాలకు అనుగుణంగా రాణించడానికి కృషి చేస్తానని సంజు అంటున్నాడు.

స్పెషలిస్ట్ బ్యాట్స్ మన్ గా లేదా…వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ గా …ఏ పాత్ర నిర్వర్తించడానికైనా తాను సిద్ధమని ప్రకటించాడు. బంగ్లాదేశ్ తో సిరీస్ లో సంజు సత్తా చాటుకోగలిగితే…వచ్చే టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనే భారతజట్టులో తన చోటు ఖాయం చేసుకోగలుగుతాడు.

ముంబై థండర్ హిట్టర్ శివం దూబే..

భారత టీ-20 జట్టులో తొలిసారిగా చోటు సంపాదించిన శివం దూబే..అందివచ్చిన అవకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోగలనన్న ధీమాతో ఉన్నాడు.

ఎడమచేతి వాటం హిట్టర్ గా, కుడిచేతి వాటం మీడియం పేసర్ గా…బ్యాటింగ్, బౌలింగ్ కలగలసిన పవర్ హిట్టింగ్ ఆల్ రౌండర్ గా గుర్తింపు తెచ్చుకొన్న శివం దూబే…భారత మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ చంద్రకాంత్ పండిట్ శిక్షణలో రాటు దేలడమే కాదు…ముంబై రంజీ జట్టులో కీలక సభ్యుడిగా మారాడు.

గ్రౌండ్ నలుమూలలకు అలవోకగా…ఎడాపెడా సిక్సర్లు, బౌండ్రీలు బాదుదుడులో శివం స్పెషలిస్ట్ గా మారాడు. బరోడాతో జరిగిన రంజీ మ్యాచ్ లో ఐదుబాల్స్ లో ఐదుసిక్సర్లు బాదడం ద్వారా..ఐపీఎల్ వేలంలో బెంగళూరు ఫ్రాంచైజీ నుంచి 5 కోట్ల రూపాయల కాంట్రాక్టు సాధించాడు.

విరాట్ కొహ్లీ, ఏబీ డివిలియర్స్ లను చూసి ఎంతో నేర్చుకొన్నానని శివం గుర్తు చేసుకొన్నాడు.

ఆరేళ్ల ప్రాయం నుంచే క్రికెట్…

తండ్రి ప్రేరణతో ఆరేళ్ల ప్రాయం నుంచే క్రికెట్ బ్యాట్ పట్టిన శివం…ఆర్థిక సమస్యలతో 14 నుంచి 18 సంవత్సరాల మధ్యకాలంలో ఆటకు దూరమయ్యాడు.

ఆ తర్వాత కుటుంబసభ్యులు, బంధువులు అండగా నిలవటం, ఐదేళ్లపాటు చంద్రకాంత్ పండిట్ అకాడమీలో శిక్షణతో నాణ్యమైన క్రికెటర్ గా శివం రాటుదేలాడు.

భారతజట్టులో చోటు సంపాదించాలన్నది తన తండ్రికలని…ఆ కల నెరవేరిందని శివం దూబే మురిసిపోతున్నాడు. ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా గాయంతో అందుబాటులో లేకపోడంతో…ఆ స్థానంలో శివం దూబేకు సెలెక్టర్లు అవకాశం కల్పించారు.

బంగ్లాతో జరిగే టీ-20 సిరీస్ శివం దూబే కెరియర్ ను ఏమేరకు మలుపు తిప్పుతుందో వేచిచూడాల్సిందే.
సంజు శాంసన్, శివం దూబే ఇద్దరూ అంచనాలకు తగ్గట్టుగా ఆడగలిగితే…భారత్ కు మరో ఇద్దరు అగ్గిపిడుగుల్లాంటి ఆటగాళ్లు దొరికినట్లే అవుతుంది.

Tags:    
Advertisement

Similar News