ఉమేష్ పాపం... మేఘాకు శాపం

వివిధ రంగాల్లో దూసుకుపోతున్న మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (మెయిల్‌) సంస్థ పేరు ఇటీవల కాలంలో అందరికీ సుపరిచితమైంది. ఇరిగేషన్‌, పవర్‌ ప్రాజెక్టులు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, డ్రింకింగ్‌ వాటర్‌, హైడ్రోకార్బన్స్‌, ట్రాన్స్‌పోర్టేషన్‌, ఏవియేషన్‌ తదితర రంగాలలో దూసుకుపోతూ రికార్డులు సృష్టిస్తున్న మేఘా సంస్థ, దాని యజమానులు ఎప్పుడూ వార్తల్లో వ్యక్తులు కాదు. మీడియాకు, ప్రచారానికి చాలా దూరంగా ఉండే వాళ్ళు. అయితే వీళ్ళే మీడియా రంగంలోకి అడుగుపెట్టినప్పటి నుంచి మేఘా పై వ్యతిరేక ప్రచారాలు మొదలయ్యాయి. అన్ని […]

Advertisement
Update:2019-10-25 05:34 IST

వివిధ రంగాల్లో దూసుకుపోతున్న మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (మెయిల్‌) సంస్థ పేరు ఇటీవల కాలంలో అందరికీ సుపరిచితమైంది. ఇరిగేషన్‌, పవర్‌ ప్రాజెక్టులు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, డ్రింకింగ్‌ వాటర్‌, హైడ్రోకార్బన్స్‌, ట్రాన్స్‌పోర్టేషన్‌, ఏవియేషన్‌ తదితర రంగాలలో దూసుకుపోతూ రికార్డులు సృష్టిస్తున్న మేఘా సంస్థ, దాని యజమానులు ఎప్పుడూ వార్తల్లో వ్యక్తులు కాదు. మీడియాకు, ప్రచారానికి చాలా దూరంగా ఉండే వాళ్ళు. అయితే వీళ్ళే మీడియా రంగంలోకి అడుగుపెట్టినప్పటి నుంచి మేఘా పై వ్యతిరేక ప్రచారాలు మొదలయ్యాయి.

అన్ని పార్టీలతోనూ సఖ్యతగా ఉంటూ అందరికీ సహాయ సహకారాలు అందించే మేఘా యాజమాన్యానికి ఇటీవలి కాలంలో కొన్ని పార్టీల నుంచీ సెగ మొదలైంది.

ధార్మిక కార్యక్రమాలకు, సామాజిక సేవా కార్యక్రమాలకు సాటిలేని విధంగా సహాయ సహకారాలు అందించే మేఘా యాజమాన్యం పై గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు వ్యతిరేక వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. సంబంధం లేని వ్యవహారాలను కూడా పెద్ద పెద్ద మీడియా సంస్థలు సైతం మేఘాకు అంటగట్టడం విశేషం.

కొద్దిరోజుల క్రితం సిటీ బ్యాంక్‌ వేరే ఒక సంస్థకు నోటీసులు అందజేస్తే…. మెయిల్‌ కు అందజేసినట్లుగా మీడియాలో ప్రచారం జరిగింది.

అలాగే కర్నూల్ ఎయిర్ పోర్టు వివాదాల విషయంలోనూ మీడియా సంస్థలు తెలిసే… ఆ ఎయిర్ పోర్టుతో సంబంధం లేని మేఘా సంస్థను బదనాం చేశాయి.

అలాగే నెల్లూరు జిల్లా దగదర్తిలో విమానాశ్రయ నిర్మాణ పనులు దక్కించుకుని, 1300 ల ఎకరాలు సేకరించి, విమానాశ్రయ నిర్మాణానికి శంఖుస్థాపన చేసి, ఎన్నాళ్ళు అయినా పనులు ప్రారంభించకపోవడంతో మేఘా ఇంజనీరింగ్‌ సంస్థకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసిందని పెద్ద పెద్ద మీడియా సంస్థల్లో ఈరోజు వార్తలొచ్చాయి. అయితే ఈ కాంట్రాక్టు దక్కించుకున్నది మేఘా (మెయిల్‌) సంస్థ కాదు… వంకాయలపాటి ఉమేష్ కు చెందిన వేరే సంస్థ.

సామాన్య జనానికి ఈ తేడా తెలియకపోవచ్చుగానీ, బిజినెస్‌ జర్నలిస్టులకు, మీడియా అధిపతులకు…. ఆ రెండు సంస్థలు వేరువేరని వాళ్ళకు తెలుసు. అయినా మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ మీద బురద జల్లే రాతలు ఎందుకో మాత్రం జనానికి తెలియదు.

Tags:    
Advertisement

Similar News