అంత చిరుతిండి ఎలా తిన్నావు లోకేష్?

విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్‌పై హత్యాయత్నం జరిగినప్పుడు అక్కడున్న ప్యూజన్ రెస్టారెంట్ ఓనర్ హర్షవర్థన్ చౌదరి పేరు ప్రముఖంగా వినిపించింది. జగన్‌పై దాడి చేసిన శ్రీనివాస్‌ను తన రెస్టారెంట్‌లోకి తీసుకొచ్చి పెట్టుకున్నది ఈ హర్షవర్థనే. అలా జగన్‌పై దాడి జరగడానికి అవకాశం ఇచ్చిన వారిలో ఈయన ఒకరు. ఇప్పటికీ విశాఖ ఎయిర్‌పోర్టులో హర్షవర్థన్ హవానే కొనసాగుతోంది. గతంలో జగన్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చినప్పుడు బయట నుంచి కాఫీ తెచ్చుకోవడానికి కూడా అంగీకరించలేదు హర్షవర్థన్‌ చౌదరి. ఎయిర్‌పోర్టు అధికారుల ద్వారా ఎయిర్‌పోర్టులోకి […]

Advertisement
Update:2019-10-22 14:27 IST

విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్‌పై హత్యాయత్నం జరిగినప్పుడు అక్కడున్న ప్యూజన్ రెస్టారెంట్ ఓనర్ హర్షవర్థన్ చౌదరి పేరు ప్రముఖంగా వినిపించింది. జగన్‌పై దాడి చేసిన శ్రీనివాస్‌ను తన రెస్టారెంట్‌లోకి తీసుకొచ్చి పెట్టుకున్నది ఈ హర్షవర్థనే. అలా జగన్‌పై దాడి జరగడానికి అవకాశం ఇచ్చిన వారిలో ఈయన ఒకరు.

ఇప్పటికీ విశాఖ ఎయిర్‌పోర్టులో హర్షవర్థన్ హవానే కొనసాగుతోంది. గతంలో జగన్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చినప్పుడు బయట నుంచి కాఫీ తెచ్చుకోవడానికి కూడా అంగీకరించలేదు హర్షవర్థన్‌ చౌదరి. ఎయిర్‌పోర్టు అధికారుల ద్వారా ఎయిర్‌పోర్టులోకి బయటి నుంచి కాపీ తేకుండా అడ్డుకున్నాడు.

అయితే ఈనెల 10, 11 తేదీల్లో చంద్రబాబు విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు ఎయిర్‌పోర్టులోని వీఐపీ లాంజ్‌లో సందడి చేశాడు. 11వ తేదీన హైదరాబాద్‌కు వెళ్ళేందుకు రాత్రి విశాఖ ఎయిర్‌ పోర్టుకు రాగా… ఆయన వెంట భారీగా కార్యకర్తలు ఎయిర్‌ పోర్టులోని వీఐపీ లాంజ్‌లోకి చొచ్చుకొచ్చారు. కానీ ఎయిర్‌పోర్టు భద్రతా సిబ్బంది నోరు మెదపలేదు.

గతంలో కాఫీని కూడా బయట నుంచి తెచ్చేందుకు అంగీకరించని హర్షవర్థన్ చౌదరి… చంద్రబాబుతోపాటు వచ్చిన కార్యకర్తలకు వీఐపీ లాంజ్‌లోనే బయటి నుంచి తెచ్చిన చికెన్ బిర్యానీని వడ్డించాడు. దాంతో వీఐపీ లాంజ్‌ మొత్తం అపరిశుభ్రంగా మారింది. దీనిపై ఆ తర్వాత ఎయిర్‌పోర్టు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.

ఈ అంశాన్ని పక్కనపెడితే… టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబునాయుడు, నారా లోకేష్ విశాఖ ఎయిర్‌పోర్టులో అందుకున్న రాచమర్యాదలకు సంబంధించిన బిల్లు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అప్పుడప్పుడు విశాఖ ఎయిర్‌పోర్టుకు చంద్రబాబు, నారా లోకేష్ వచ్చినప్పుడు వీఐపీ లాంజ్లో 10, 15 నిమిషాలు గడిపేవారు. ఆ సమయంలో హర్షవర్థన్ చౌదరికి చెందిన ప్యూజన్ రెస్టారెంట్ నుంచి చిరుతిండ్లు, కాఫీ, టీ అందించేవారు. విశాఖ ఎయిర్‌పోర్టుకు వీరు ఏమీ రోజూరారు. ఎప్పుడో ఒకసారి వస్తుంటారు. అలాంటిది ఒక్క ఎయిర్‌పోర్టులో వీరి చిరుతిండ్లకు అయిన బిల్లు ఏకంగా 25 లక్షల రూపాయలు.

ఈ 25 లక్షల్లో అత్యధిక మొత్తం నారా లోకేష్‌దే. సీఎం ప్రోటోకాల్‌ తో సమానంగా చినబాబుకు ఎయిర్‌పోర్టులో మర్యాదలు చేశారు. ఇప్పటికే ఈ 25 లక్షల బిల్లులో 12 లక్షలను గత ప్రభుత్వంలోనే హర్షవర్థన్ చౌదరికి చెల్లించారు. మిగిలిన 13 లక్షల 44 వేలు పెండింగ్‌లో ఉంది. ఈ బిల్లు కొత్త ప్రభుత్వం వద్దకు వచ్చింది.

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎదురు చెప్పకుండా బిల్లులు క్లియర్ చేసినప్పటికీ… ఇప్పుడు మాత్రం పరిస్థితి వేరు. కేవలం కాఫీ, టీలకు ఎయిర్‌పోర్టులో ఒక్క మంత్రికే ఇన్ని లక్షలు ఖర్చు ఎలా అయిందని అధికారులు తలపట్టుకుంటున్నారు.

చూడాలి… చినబాబు చిరుతిండ్ల బాకీ 13 లక్షల 44 వేలను హర్షవర్థన్ చౌదరికి ప్రభుత్వం చెల్లిస్తుందో లేదో.

Tags:    
Advertisement

Similar News