అగ్రిగోల్డ్‌ డబ్బులు అప్పట్లోనే సిద్ధం చేశాం... కానీ జగన్‌ అడ్డుకున్నారు " లోకేష్ కోతలు

ఐదేళ్లు అధికారంలో ఉండి కూడా లక్షలాది అగ్రిగోల్డ్ బాధితుల్లో కనీసం ఒక్కరికి కూడా న్యాయం చేయలేకపోయింది తెలుగుదేశం ప్రభుత్వం. పైగా నారాలోకేష్ స్వయంగా రంగంలోకి దిగి అగ్రిగోల్డ్ ఆస్తులను కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు పెద్దెత్తున వచ్చాయి. బాధితులు ధర్నాలు చేసినా వారికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఆస్తులు వేలం వేసి బాధితుల సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించలేదు. కొత్త ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేందుకు తొలి విడతలో భాగంగా రూ. 264 కోట్లు విడుదల చేసింది. ఆర్థిక […]

Advertisement
Update:2019-10-21 01:30 IST

ఐదేళ్లు అధికారంలో ఉండి కూడా లక్షలాది అగ్రిగోల్డ్ బాధితుల్లో కనీసం ఒక్కరికి కూడా న్యాయం చేయలేకపోయింది తెలుగుదేశం ప్రభుత్వం. పైగా నారాలోకేష్ స్వయంగా రంగంలోకి దిగి అగ్రిగోల్డ్ ఆస్తులను కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు పెద్దెత్తున వచ్చాయి. బాధితులు ధర్నాలు చేసినా వారికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఆస్తులు వేలం వేసి బాధితుల సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించలేదు.

కొత్త ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేందుకు తొలి విడతలో భాగంగా రూ. 264 కోట్లు విడుదల చేసింది. ఆర్థిక ఇబ్బందుల దృష్ణ్యా విడతల వారీగా అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో నారా లోకేష్ ట్విట్టర్లో స్పందించారు. ఐదేళ్లు అధికారంలో ఉండి ఏమీ చేయలేకపోయిన ట్రాక్ రికార్డును కింద పెట్టుకుని ఈ అంశంపై విమర్శలు చేస్తే జనం ఏమనుకుంటారో అన్న మొహమాటం లేకుండా స్పందించారు.

అధికారంలోకి వచ్చాక అగ్రిగోల్డ్ బాధితులకు 11 వందల కోట్లు ఇస్తానని చెప్పిన జగన్…. ఇప్పుడు కేవలం రూ. 264 కోట్లు మాత్రమే ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. అంతే కాదు… టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చేందుకు రూ. 336 కోట్లు సిద్ధం చేసిందట. కానీ ప్రతిపక్ష వైసీపీ అడ్డుపడడం వల్ల ఆ డబ్బును బాధితులకు ఇవ్వలేకపోయామని నారా లోకేష్ బాబు సెలవిచ్చారు. జగన్‌ ఒక కోతల రాయుడు అని విమర్శించారు లోకేష్.

ఐదేళ్లు అధికారంలో ఉండి ఒక్క పైసాకూడా ఇవ్వలేకపోయిన నారా వారు కోతలరాయుడా?, లేక అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకే రూ. 264 కోట్లు విడుదల చేసిన జగన్‌ కోతల రాయుడా? అన్నది నారా లోకేష్‌కే తెలియాలి.

Tags:    
Advertisement

Similar News