జగన్ కంటే వైఎస్సే వెయ్యి రెట్లు బెటర్
వైఎస్‌ను అసెంబ్లీలో గడగడలాడించా… నేను లేస్తే వైఎస్ భయపడిపోయేవాడు అని చెబుతూ వస్తున్న చంద్రబాబు నాయుడు… పరోక్షంగా జగన్ వద్ద మాత్రం తన పప్పులు ఉడకడం లేదని అంగీకరిస్తున్నాడు. ఆయన చేస్తున్న వ్యాఖ్యలు అలాగే ఉన్నాయి మరి. మీడియా ముందే మొహమాటం లేకుండా వైఎస్సే బెటర్ అని గుర్తు చేసుకున్నాడు చంద్రబాబు.. గతంలో మీడియాపై ఆంక్షలు విధిస్తూ వైఎస్ జీవో తెచ్చారని… కానీ తాను మీడియా ముందుకు వచ్చి నిలదీయగానే వెంటనే వెనక్కు తీసుకున్నారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. […]
వైఎస్‌ను అసెంబ్లీలో గడగడలాడించా… నేను లేస్తే వైఎస్ భయపడిపోయేవాడు అని చెబుతూ వస్తున్న చంద్రబాబు నాయుడు… పరోక్షంగా జగన్ వద్ద మాత్రం తన పప్పులు ఉడకడం లేదని అంగీకరిస్తున్నాడు. ఆయన చేస్తున్న వ్యాఖ్యలు అలాగే ఉన్నాయి మరి. మీడియా ముందే మొహమాటం లేకుండా వైఎస్సే బెటర్ అని గుర్తు చేసుకున్నాడు చంద్రబాబు..
గతంలో మీడియాపై ఆంక్షలు విధిస్తూ వైఎస్ జీవో తెచ్చారని… కానీ తాను మీడియా ముందుకు వచ్చి నిలదీయగానే వెంటనే వెనక్కు తీసుకున్నారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. రెండుమూడుసార్లు తాను గట్టిగా తిరుగుబాటు చేయగా వైఎస్ క్షమాపణలు కూడా చెప్పారన్నారు. కానీ జగన్ మాత్రం ఎవరినీ లెక్క చేయడం లేదని… చూస్తుంటే జగన్ కంటే వైఎస్ వెయ్యి రెట్లు బెటర్ అనిపిస్తోందని తలుచుకున్నారు.
వైఎస్‌లో ఒక హుందాతనం, విజ్ఞత ఉండేదని.. తప్పు చేసినా వెంటనే సరిదిద్దుకునే వారని చంద్రబాబు ప్రశంసించారు. చంద్రబాబు వ్యాఖ్యలను చూస్తుంటే… వైఎస్‌ను పొగుడుతున్నట్టుగా లేదు… జగన్‌ను వైఎస్ కంటే వెయ్యి రెట్లు శక్తివంతుడు అని అంగీకరిస్తున్నట్టుగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.