సాహో.. అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు, నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ వెర్షన్లు..!
బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటించిన యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ ‘సాహో’. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను 350 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించిన విషయం తెలిసిందే. ఆగస్టు 30న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. కాగా, ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 425 కోట్ల రూపాయల వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ 42 […]
![సాహో.. అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు, నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ వెర్షన్లు..! సాహో.. అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు, నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ వెర్షన్లు..!](https://www.teluguglobal.com/h-upload/old_images/1500x900_120915-saaho-movie-amazon-prime.webp)
బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటించిన యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ ‘సాహో’. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను 350 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించిన విషయం తెలిసిందే. ఆగస్టు 30న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది.
కాగా, ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 425 కోట్ల రూపాయల వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ 42 కోట్ల రూపాయలకు కొన్నది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా ఈ నెల 19 నుంచి వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది.
అయితే.. ఈ సినిమా హిందీ వెర్షన్ హక్కులను మాత్రం నెట్‌ఫ్లిక్స్‌కు అమ్మారు. డైరెక్ట్ రిలీజ్‌లో కూడా హిందీ వెర్షన్ 100 కోట్ల పైగా వసూలు చేసింది. అయితే నెట్‌ఫ్లిక్స్‌లో ఎప్పటి నుంచి అందుబాటులో ఉంటుందో ఇంకా తెలియరాలేదు.