కల్కి భగవాన్ ఆశ్రమాలపై ఐటీ దాడులు

ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త కల్కి భగవాన్‌కు చెందిన ఆశ్రమాలపై తమిళనాడు ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. నాలుగు ఐటీ బృందాలు చిత్తూరు జిల్లా వరదాయపాలెంలోని ఏకం గోల్డెన్ సిటీలో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. అంతే కాకుండా ఏపీ, తమిళనాడులోని కల్కి ఆశ్రమాలకు చెందిన కార్యాలయాల్లో 40 చోట్ల ఏక కాలంలో అధికారులు సోదాలు చేస్తున్నారు. ఒకవైపు సోదాలు జరుగుతుండగానే కల్కి భగవాన్ కుమారుడు, ఏకం గోల్డెన్ సిటీ వ్యవస్థాపకుడు కృష్ణాజీతో పాటు కల్కి ట్రస్ట్ సీఈవో లోకేష్ […]

Advertisement
Update:2019-10-16 10:21 IST

ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త కల్కి భగవాన్‌కు చెందిన ఆశ్రమాలపై తమిళనాడు ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. నాలుగు ఐటీ బృందాలు చిత్తూరు జిల్లా వరదాయపాలెంలోని ఏకం గోల్డెన్ సిటీలో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. అంతే కాకుండా ఏపీ, తమిళనాడులోని కల్కి ఆశ్రమాలకు చెందిన కార్యాలయాల్లో 40 చోట్ల ఏక కాలంలో అధికారులు సోదాలు చేస్తున్నారు.

ఒకవైపు సోదాలు జరుగుతుండగానే కల్కి భగవాన్ కుమారుడు, ఏకం గోల్డెన్ సిటీ వ్యవస్థాపకుడు కృష్ణాజీతో పాటు కల్కి ట్రస్ట్ సీఈవో లోకేష్ దాసోజీని ఐటీ అధికారులు వేర్వేరుగా విచారిస్తున్నారు.

గత కొన్నేండ్లుగా కల్కి ఆశ్రమ నిర్వాహకులు భక్తుల నుంచి సేకరిస్తున్న విరాళాల సోమ్ముతో భూముల కొనుగోలు, బ్యాంకు డిపాజిట్లు చేయడం వంటివి చేశారనే అనుమానంతో వాటిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ట్రస్ట్ ఆస్తులకు సంబంధించిన రికార్డులన్నింటినీ పరిశీలిస్తున్న అధికారులు.. ఆదాయ, వ్యయాల వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు.

మరోవైపు ఉదయం నుంచి కల్కి కార్యాలయాలు, ఆశ్రమాల నుంచి ఎవరినీ లోపలికి అనుమతించడం లేదు. ఐటీ అధికారులు ఇప్పటికే లోపల ఉన్న వాళ్ల ఫోన్లు స్వాధీనం చేసుకొని అన్ని ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News