రవిప్రకాశ్ మీడియా హౌస్‌పై ఫిర్యాదు

టీవీ9లో అవకతవకలకు పాల్పడి ఆ సంస్థ నుంచి బహిష్కరించబడిన మాజీ సీఈవో రవి ప్రకాశ్‌పై హైకోర్టు న్యాయవాది రామరావు సైబర్ క్రైం పోలీసులకు పిర్యాదు చేశారు. అతనికి చెందిన రవిప్రకాశ్ మీడియా హౌస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి కొన్ని వెబ్ చానల్స్ ఉన్నాయి. ఈ వెబ్ ఛానల్స్‌లో తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు రవిప్రకాశ్‌కు ఎలాంటి సంబంధం లేదని.. తాను అతనిపై ఏనాడూ ఫిర్యాదు చేయలేదని.. కాని పనికట్టుకొని తానే […]

Advertisement
Update:2019-10-16 01:08 IST

టీవీ9లో అవకతవకలకు పాల్పడి ఆ సంస్థ నుంచి బహిష్కరించబడిన మాజీ సీఈవో రవి ప్రకాశ్‌పై హైకోర్టు న్యాయవాది రామరావు సైబర్ క్రైం పోలీసులకు పిర్యాదు చేశారు. అతనికి చెందిన రవిప్రకాశ్ మీడియా హౌస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి కొన్ని వెబ్ చానల్స్ ఉన్నాయి. ఈ వెబ్ ఛానల్స్‌లో తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.

తనకు రవిప్రకాశ్‌కు ఎలాంటి సంబంధం లేదని.. తాను అతనిపై ఏనాడూ ఫిర్యాదు చేయలేదని.. కాని పనికట్టుకొని తానే పిర్యాదు చేసినట్లు తన వెబ్ ఛానల్స్‌లో తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

రవిప్రకాశ్ ఆర్థిక అక్రమాలపై సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టీస్‌కు ఫిర్యాదు చేసింది వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అయితే.. అది నేనే ఫిర్యాదు చేశానంటూ వాళ్లు ప్రచారం చేస్తున్నారని రామారావు ఆరోపించారు. సుప్రీంకు అందిన ఫిర్యాదు కాపీ తనదేనంటూ తన పరువుకు భంగం కలిగించేలా ప్రచారం చేస్తున్న రవిప్రకాశ్ మీడియా హౌస్‌పై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు.

కాగా, తన పరువుకు భంగం కలిగించేలా వార్తలు రాసినందుకు రవిప్రకాశ్, ఆయన సంస్థపై పరువునష్టం దావా వేయబోతున్నట్లు రామారావు స్పష్టం చేశారు.

Tags:    
Advertisement

Similar News