పవన్‌ పక్కన ఎప్పుడూ నాదెండ్లే కూర్చోవాలా? రాపాకను ఎందుకు కూర్చోనివ్వరు? " అద్దేపల్లి

ఇటీవల ఒక సమావేశానికి ఆలస్యంగా వచ్చిన జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పట్ల జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ వ్యవహరించిన తీరును అద్దెపల్లి శ్రీధర్ తప్పుపట్టారు. వెనుక బడిన వర్గాలకు చెందిన ఒక్క ఎమ్మెల్యేను గౌరవించాల్సిన అవసరం జనసేనపై ఉందన్నారు. ఇటీవల సమావేశానికి ఆలస్యంగా వచ్చిన రాపాక … కుర్చీ కోసం చూస్తుండగా ఆసమయంలో నాదెండ్ల మనోహర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. మీరు ఆలస్యంగా వస్తే మేమేమి చేయాలి. బొట్టుపెట్టి ఆహ్వానించాలా… అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. […]

Advertisement
Update:2019-10-16 05:11 IST

ఇటీవల ఒక సమావేశానికి ఆలస్యంగా వచ్చిన జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పట్ల జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ వ్యవహరించిన తీరును అద్దెపల్లి శ్రీధర్ తప్పుపట్టారు. వెనుక బడిన వర్గాలకు చెందిన ఒక్క ఎమ్మెల్యేను గౌరవించాల్సిన అవసరం జనసేనపై ఉందన్నారు.

ఇటీవల సమావేశానికి ఆలస్యంగా వచ్చిన రాపాక … కుర్చీ కోసం చూస్తుండగా ఆసమయంలో నాదెండ్ల మనోహర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. మీరు ఆలస్యంగా వస్తే మేమేమి చేయాలి. బొట్టుపెట్టి ఆహ్వానించాలా… అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియో బాగా వైరల్ అయింది.

మనోహర్ అలా చులకన వ్యాఖ్యలు చేసిన సమయంలో పవన్‌ కల్యాణ్ పక్కనే ఉన్నారు. కానీ ఆయన మౌనంగా ఉన్నారు. దాంతో రాపాకే మౌనంగా వెనక్కు తగ్గారు.

ఈ ఉదంతంపై స్పందించిన అద్దెపల్లి శ్రీధర్ … వాస్తవాలు తెలుసుకునేందుకు తాను కూడా ఈ వీడియో గురించి వ్యక్తిగతంగా ఆరా తీశానని చెప్పారు. రాపాక పట్ల మనోహర్ అలా వ్యవహరించింది నిజమేనన్నారు. అన్ని కార్యక్రమాల్లోనూ పవన్‌ కల్యాణ్ పక్కన నాదెండ్ల మనోహరే ఎందుకు కూర్చోవాలని అద్దేపల్లి ప్రశ్నించారు.

పార్టీ తరపున ఒకే ఎమ్మెల్యే గెలిచారని.. అది కూడా వెనుకబడిన వర్గాలకు చెందిన రాపాక గెలిచారని… కాబట్టి ఆయనను ఎందుకు పవన్‌ కల్యాణ్ పక్కన కూర్చోనివ్వడం లేదని ప్రశ్నించారు. ఇలాంటి ధోరణిని ప్రజలంతా గమనిస్తున్నారని అద్దేపల్లి హెచ్చరించారు.

రాపాక వరప్రసాద్‌ ఏమీ చిన్నపిల్లాడు కాదని.. వయసులో పెద్దవారని… అలాంటి వ్యక్తిని పట్టుకుని బొట్టుపెట్టి పిలవాలా అంటూ నాదెండ్ల మనోహర్‌ వ్యాఖ్యానించడం ఏమాత్రం స్వాగతించదగ్గ అంశం కాదన్నారు అద్దేపల్లి శ్రీధర్.

Tags:    
Advertisement

Similar News