జగన్ భయపడి ఉంటే దగ్గుబాటితో అలా అనేవారా?
మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రెండు రోజుల క్రితం వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు. నియోజకవర్గంలో పరిస్థితిపై చర్చించారు. ఇటీవల టీడీపీ నుంచి రావి రామనాథంబాబును తిరిగి వైసీపీలోకి తీసుకున్న నేపథ్యంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఈ అంశంపైనా చర్చించినట్టు చెబుతున్నారు. పర్చూరు ఇన్‌చార్జ్‌గా మీరే ఉంటారు.. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు . కానీ టీడీపీ అనుకూల పత్రిక మాత్రం ఇందుకు భిన్నంగా ఒక కథనాన్ని ప్రచురించింది. ఉంటే […]
మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రెండు రోజుల క్రితం వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు. నియోజకవర్గంలో పరిస్థితిపై చర్చించారు. ఇటీవల టీడీపీ నుంచి రావి రామనాథంబాబును తిరిగి వైసీపీలోకి తీసుకున్న నేపథ్యంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఈ అంశంపైనా చర్చించినట్టు చెబుతున్నారు. పర్చూరు ఇన్‌చార్జ్‌గా మీరే ఉంటారు.. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు .
కానీ టీడీపీ అనుకూల పత్రిక మాత్రం ఇందుకు భిన్నంగా ఒక కథనాన్ని ప్రచురించింది. ఉంటే మీ కుటుంబం అంతా వైసీపీలోనే ఉండాలి. పురదేశ్వరి కూడా బీజేపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరాలి అని జగన్ సూటిగా దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు చెప్పేశారని తెలిసింది అంటూ కథనాన్ని ప్రచురించింది.
గతంలో కన్నా లక్ష్మీనారాయణ ఎన్నికలకు ముందు వైసీపీలో చేరేందుకు దాదాపు రంగం సిద్ధం చేసుకున్నారు. ఫ్లెక్సీలు కూడా తయారు చేయించారు. కానీ ఆఖరి నిమిషంలో ఆయన వైసీపీలో చేరకుండా బీజేపీలోనే ఉండిపోయారు. ఆ సమయంలో ఇదే టీడీపీ, ఇదే పత్రిక కొత్త కోణంలో ప్రచారం చేశాయి.
కన్నా లక్ష్మీనారాయణను వైసీపీలో చేర్చుకునేందుకు జగన్ సిద్ధమవగా ఆ విషయం తెలుసుకున్న అమిత్ షా నేరుగా జగన్‌కు ఫోన్ చేసి తమ పార్టీ నేత కన్నాను ఎలా చేర్చుకుంటారని జగన్‌ను నిలదీశారు… దాని భయపడిపోయిన జగన్ కన్నా లక్ష్మీనారాయణను వైసీపీలో చేర్చుకోలేదని ఇదే పత్రిక అప్పట్లో ఒక కథనాన్ని రాసింది.
అప్పట్లో అమిత్ షాకు జగన్ భయపడ్డారని ఈ పత్రిక రాసిన కథనమే నిజమైతే… ఇప్పుడు బీజేపీలో ఉన్న పురందేశ్వరి చేత రాజీనామా చేయించాల్సిందే… ఆమె తమ పార్టీలో చేరాల్సిందే అని జగన్ ఇంత సూటిగా తేల్చి చెప్పేవారా?. జగన్ అమిత్ షాకు భయపడే ఆరోజు కన్నాను పార్టీలోకి చేర్చుకోకుండా ఉండి ఉంటే… ఈ రోజు బీజేపీ అధ్యక్ష పదవితో పాటు, కేంద్ర హోంశాఖ మంత్రిగా కూడా ఉన్నఅమిత్ షాకు జగన్ మరింత భయపడాలి కదా!.
అప్పట్లో కథనాన్ని, ఇప్పుడు కథనాన్ని పరిశీలిస్తే నాడు అమిత్ షాకు జగన్ భయపడ్డారు అన్న కథనమూ అవాస్తవమే…. ఇప్పుడు పురందేశ్వరి చేత రాజీనామా చేయించాల్సిందే అని జగన్ హుకుం జారీ చేశారన్న కథనం కూడా అవాస్తవమే అనిపిస్తుంది.
కేవలం బీజేపీలో ఉన్న పురందేశ్వరిని కూడా జగన్ బెదిరిస్తున్నారన్న భావన కమలనాథుల్లో కలిగించి వైసీపీ పైన వారిలో వ్యతిరేకత పెంచాలన్నదే టీడీపీ పత్రిక ప్రధాన ఉద్దేశంగా ఉంది. దగ్గుబాటి కుటుంబానికి వైసీపీలో అవమానాలు ఎదురవుతున్నాయి అని చాటడం కథనం ఉద్దేశం అయి ఉండవచ్చు.