వైమానికదళ దినోత్సవ వేడుకల్లో సచిన్

త్రివిధ దళాధిపతులతో కలసి పాల్గొన్న మాస్టర్ భారత వైమానికదళ 87వ దినోత్సవ వేడుకల్లో…మాస్టర్ సచిన్ టెండుల్కర్ గౌరవ గ్రూప్ కెప్టెన్ హోదాలో …తన భార్య అంజలితో కలసి పాల్గొన్నాడు. త్రివిధ దళాధిపతులతో కలసి వైమానికదళ విన్యాసాలను తిలకించాడు. 2010లో భారత వైమానిక దళంలో గౌరవ గ్రూప్ కెప్టెన్ హోదాతో చేరిన సచిన్.. అప్పటి నుంచి ఇండియన్ ఏర్ ఫోర్స్ తో తన అనుబంధాన్ని కొనసాగిస్తూ వస్తున్నాడు. హిండాన్ లోని భారత వైమానిక దళ శిబిరంలో నిర్వహించిన వేడుకలకు… ఇండియన్ ఏర్ […]

Advertisement
Update:2019-10-08 12:56 IST
  • త్రివిధ దళాధిపతులతో కలసి పాల్గొన్న మాస్టర్

భారత వైమానికదళ 87వ దినోత్సవ వేడుకల్లో…మాస్టర్ సచిన్ టెండుల్కర్ గౌరవ గ్రూప్ కెప్టెన్ హోదాలో …తన భార్య అంజలితో కలసి పాల్గొన్నాడు. త్రివిధ దళాధిపతులతో కలసి వైమానికదళ విన్యాసాలను తిలకించాడు.

2010లో భారత వైమానిక దళంలో గౌరవ గ్రూప్ కెప్టెన్ హోదాతో చేరిన సచిన్.. అప్పటి నుంచి ఇండియన్ ఏర్ ఫోర్స్ తో తన అనుబంధాన్ని కొనసాగిస్తూ వస్తున్నాడు.

హిండాన్ లోని భారత వైమానిక దళ శిబిరంలో నిర్వహించిన వేడుకలకు… ఇండియన్ ఏర్ ఫోర్స్ యూనిఫామ్ ను ధరించి మరీ సచిన్ హాజరయ్యాడు.

మిగ్ -21 బైసన్ యుద్ధవిమానాల దళం నిర్వహించిన విన్యాసాలకు వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్ నాయకత్వం వహించడం విశేషం.

వైమానిక దళ సిబ్బందితో కలసి ఫోటోలు దిగటమే కాదు…వారు భారతమాతకు చేస్తున్న సేవలను మాస్టర్ కొనియాడాడు.

ప్రధాని నరేంద్ర మోడీ కలలకు ప్రతిరూపమైన స్వచ్ఛభారత్ ను అందరూ దైనిందిన జీవితంలో ఆచరిస్తే..ఆరోగ్యవంతమైన సమాజాన్ని, భారత దేశాన్ని నిర్మించుకోగలమని ట్విట్టర్ లో పేర్కొన్నాడు. వైమానికదళ సిబ్బందికి ప్రశంసలతో పాటు అభినందనలు తెలిపాడు.

Tags:    
Advertisement

Similar News