అమిత్ షా సహాయం కోరిన ఏబీఎన్ రాధాకృష్ణ
ఎన్నికల ముందు మోడీని దింపేస్తా, బీజేపీని భూస్థాపితం చేస్తా, అమిత్ షాను పరుగులుపెట్టిస్తా అంటూ చంద్రబాబు చేసిన ప్రసంగాలను బాగా ప్రాచూర్యం కలిపించడంతో పాటు…. బీజేపీకి వ్యతిరేకంగా నిత్యం కథనాలు రాసిన ఆంధ్రజ్యోతి యాజమాన్యం ఇప్పుడు తిరిగి బీజేపీ పెద్దలను ఆశ్రయించింది. ఇప్పటికే సుజనా, సీఎం రమేష్ లు బీజేపీలో చేరి చంద్రబాబుపై బీజేపీ పెద్దల కోపాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తుండగా… మరికొందరు ప్రముఖులు కూడా రంగంలోకి దిగుతున్నారు. ఇందులో భాగంగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అమిత్ షాను ఢిల్లీలో […]
ఎన్నికల ముందు మోడీని దింపేస్తా, బీజేపీని భూస్థాపితం చేస్తా, అమిత్ షాను పరుగులుపెట్టిస్తా అంటూ చంద్రబాబు చేసిన ప్రసంగాలను బాగా ప్రాచూర్యం కలిపించడంతో పాటు…. బీజేపీకి వ్యతిరేకంగా నిత్యం కథనాలు రాసిన ఆంధ్రజ్యోతి యాజమాన్యం ఇప్పుడు తిరిగి బీజేపీ పెద్దలను ఆశ్రయించింది.
ఇప్పటికే సుజనా, సీఎం రమేష్ లు బీజేపీలో చేరి చంద్రబాబుపై బీజేపీ పెద్దల కోపాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తుండగా… మరికొందరు ప్రముఖులు కూడా రంగంలోకి దిగుతున్నారు. ఇందులో భాగంగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అమిత్ షాను ఢిల్లీలో కలిశారు. చంద్రబాబుకు రాధాకృష్ణ కొన్నేళ్లుగా ప్రధాన రాజకీయ వ్యూహకర్తగా కూడా పనిచేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో తన చానల్ ప్రసారాలు నిలిపివేశారని అమిత్ షాకు రాధాకృష్ణ విన్నవించుకున్నారు. జగన్‌కు చెప్పి ప్రసారాలు పునరుద్దరించేలా చూడాలని అమిత్ షాను ఆర్కే కోరినట్టు చెబుతున్నారు. అందుకు ప్రతిఫలంగా తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఎదుగుదలకు తమ మీడియా ద్వారా మద్దతు ఇస్తామని ఆఫర్ చేసినట్టు సమాచారం.
ఆంధ్రజ్యోతి మీడియా మాత్రం అమిత్ షానే రాధాకృష్ణను ఆహ్వానించారని చెబుతోంది.