2019 సెప్టెంబర్... 102 సంవత్సరాల రికార్డ్....
భారతదేశంలో ఇప్పటివరకు సెప్టెంబర్ నెలలో కురిసిన వర్షపాత గణాంకాలను పరిశీలించినప్పుడు… ఈ ఏడాది సెప్టెంబర్ వర్షపాతం… 102 సంవత్సరాలలో అత్యధికం అని తేలింది. ఇంతటి వర్షపాతానికి కారణం రుతుపవనాల ఉపసంహరణ ఆలస్యం కావడమే అని అంటున్నారు. వర్షపాతం సాధారణం కంటే 9 శాతం పెరగడానికి ఈ ఆలస్యం దోహదం చేసింది. దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం కొనసాగుతూ ఉండటం వల్ల 102 సంవత్సరాలలో భారతదేశంలో అత్యంత తేమతో కూడిన సెప్టెంబర్‌గా ఈ ఏడాది సెప్టెంబర్ అవతరించింది. సెప్టెంబర్ […]
భారతదేశంలో ఇప్పటివరకు సెప్టెంబర్ నెలలో కురిసిన వర్షపాత గణాంకాలను పరిశీలించినప్పుడు… ఈ ఏడాది సెప్టెంబర్ వర్షపాతం… 102 సంవత్సరాలలో అత్యధికం అని తేలింది. ఇంతటి వర్షపాతానికి కారణం రుతుపవనాల ఉపసంహరణ ఆలస్యం కావడమే అని అంటున్నారు.
వర్షపాతం సాధారణం కంటే 9 శాతం పెరగడానికి ఈ ఆలస్యం దోహదం చేసింది. దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం కొనసాగుతూ ఉండటం వల్ల 102 సంవత్సరాలలో భారతదేశంలో అత్యంత తేమతో కూడిన సెప్టెంబర్‌గా ఈ ఏడాది సెప్టెంబర్ అవతరించింది.
ఈ సంఖ్య 1983 లో నమోదయిన రికార్డు స్థాయి (255.8 మిమీ)ని దాటిపోయే అవకాశం ఉందని ఓ నివేదిక పేర్కొంది.
రుతుపవనాల తిరోగమనం ఇంకా ప్రారంభం కాకపోవడం వలన భారతదేశ మధ్య, వాయువ్య భాగాలలో నవరాత్రి పండుగను వర్షాలలోనే జరుపుకోవల్సి రావచ్చని భారత వాతావరణ శాఖ (ఐఎండి) అంచనా వేస్తున్నది.
అక్టోబర్ 7 నాటికి పంజాబ్, రాజస్థాన్, కచ్ లోని కొన్ని ప్రాంతాల్లో రుతుపవనాల తిరోగమనం ప్రారంభమవుతుందని అధికారులను ఉటంకిస్తూ ఓ ఆంగ్ల పత్రిక నివేదిక సూచిస్తున్నది. సాధారణంగా ఆ ప్రాంతాలలో రుతుపవనాల తిరోగమనం సెప్టెంబర్ 1 కల్లా ప్రారంభం కావాలి.
సాధారణంగా అక్టోబర్ 1 నాటికి తిరోగమనం ప్రారంభమయ్యే మహారాష్ట్రలో, ప్రస్తుత పరిస్థితులలో తేలికపాటి వర్షపాతం అక్టోబర్ 15 వరకు కొనసాగే అవకాశం ఉంది.
సెప్టెంబరు 29 వరకు మూడు రోజులపాటు నిరంతర వర్షపాతం కొనసాగటంతో తీవ్రమైన అతివృష్టి పరిస్థితులు తలెత్తాయి. సెప్టెంబరు 29 న బీహార్‌లో కనీసం 18 మంది ప్రాణాలు కోల్పోయారు. వర్షాలు కురిసిన కారణంగా వీధులు, రైల్వే ట్రాక్‌లు, వ్యాపార సముదాయాలు… ఒకటేమిటి మొత్తం ప్రజల దైనందిన జీవితమే మునిగి పోయింది.
రాష్ట్ర రాజధాని పాట్నా తీవ్రంగా నష్టపోయింది. ఛాతీ వరకు పెరిగిన వరద నీటిలో అది తేలియాడుతున్నది. వీధుల్లో బస్సులు, కార్లకు బదులు పడవలు తిరుగుతున్నాయి. మునిసిపల్ క్రేన్ల సహాయంతో జనాన్ని నీటిలో మునిగిన ప్రాంతాల నుంచి పైకి తీస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.