క్రికెట్ గ్రేట్ బ్రాడ్మన్ సరసన రోహిత్ శర్మ

స్వదేశీ గడ్డపై రోహిత్ టెస్ట్ సగటు 98.22 15 ఇన్నింగ్స్ లో 884 పరుగుల రోహిత్ క్రికెట్ దిగ్గజం సర్ డోనాల్డ్ బ్రాడ్మన్ సరసన భారత డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ చోటు సంపాదించాడు. స్వదేశీగడ్డపై జరిగిన టెస్టుమ్యాచ్ ల్లో బ్రాడ్మన్ సగటు 98.22రికార్డును రోహిత్ శర్మ సమం చేశాడు. ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లో భాగంగా విశాఖ వేదికగా సౌతాఫ్రికాతో ప్రారంభమైన తొలిటెస్టు తొలిరోజు ఆటలో రోహిత్ ఆజేయ సెంచరీ చేయడం ద్వారా.. ఈ ఘనతను సొంతం […]

Advertisement
Update:2019-10-03 02:16 IST
  • స్వదేశీ గడ్డపై రోహిత్ టెస్ట్ సగటు 98.22
  • 15 ఇన్నింగ్స్ లో 884 పరుగుల రోహిత్

క్రికెట్ దిగ్గజం సర్ డోనాల్డ్ బ్రాడ్మన్ సరసన భారత డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ చోటు సంపాదించాడు. స్వదేశీగడ్డపై జరిగిన టెస్టుమ్యాచ్ ల్లో బ్రాడ్మన్ సగటు 98.22రికార్డును రోహిత్ శర్మ సమం చేశాడు.

ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లో భాగంగా విశాఖ వేదికగా సౌతాఫ్రికాతో ప్రారంభమైన తొలిటెస్టు తొలిరోజు ఆటలో రోహిత్ ఆజేయ సెంచరీ చేయడం ద్వారా.. ఈ ఘనతను సొంతం చేసుకొన్నాడు.

సొంతగడ్డపై ఆడిన టెస్టుమ్యాచ్ ల్లో ..మొత్తం 15 ఇన్నింగ్స్ లో నాలుగో సెంచరీతో సహా 884 పరుగులు సాధించడం ద్వారా రోహిత్ తన సగటును 98.22కు పెంచుకోగలిగాడు.

క్రికెట్ ఆల్ టైమ్ గ్రేట్ సర్ డోనాల్డ్ బ్రాడ్మన్ సైతం స్వదేశంలో ఆడిన టెస్టుమ్యాచ్ ల్లో 98.22 సగటు సాధించడం విశేషం.

ఓపెనర్ గా తొలిటెస్టులోనే శతకం…

సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లో ఓపెనర్ గా తొలిమ్యాచ్ లోనే శతకం బాదిన భారత నాలుగో క్రికెటర్ గా రోహిత్ మరో రికార్డు సాధించాడు. ఇంతకుముందే.. శిఖర్ ధావన్, రాహుల్, పృథ్వీ షా సైతం తమతమ టెస్ట్ అరంగేట్రం మ్యాచ్ ల్లోనే సెంచరీలు సాధించిన భారత క్రికెటర్లుగా నిలిచారు.

Tags:    
Advertisement

Similar News