ఉల్లి ధరపై కేంద్రం పోరాటం

దేశంలో దూసుకెళ్తున్న ఉల్లి ధరలను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలకు సిద్ధమైంది. ఉల్లి ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఇతర దేశాలకు ఎగుమతులపై నిషేధం విధించింది. అదే సమయంలో కొందరు వ్యాపారులు కృత్తిమ కొరత సృష్టించి సొమ్ము చేసేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో వ్యాపారుల వద్ద నిల్వ మొత్తంపైనా ఆంక్షలు విధించింది. రిటైల్‌ వ్యాపారులు వంద క్వింటాళ్ల వరకు మాత్రమే స్టాక్ ఉంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. టోకు వ్యాపారులు 500 క్వింటాళ్లకు మించి ఉల్లి నిల్వలు […]

Advertisement
Update:2019-09-30 02:02 IST

దేశంలో దూసుకెళ్తున్న ఉల్లి ధరలను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలకు సిద్ధమైంది. ఉల్లి ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఇతర దేశాలకు ఎగుమతులపై నిషేధం విధించింది. అదే సమయంలో కొందరు వ్యాపారులు కృత్తిమ కొరత సృష్టించి సొమ్ము చేసేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో వ్యాపారుల వద్ద నిల్వ మొత్తంపైనా ఆంక్షలు విధించింది.

రిటైల్‌ వ్యాపారులు వంద క్వింటాళ్ల వరకు మాత్రమే స్టాక్ ఉంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. టోకు వ్యాపారులు 500 క్వింటాళ్లకు మించి ఉల్లి నిల్వలు ఉంచుకోవడానికి వీల్లేదని ఆంక్షలు విధించింది. ఈ మేరకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ ఆదేశాలు జారీ చేసింది.

ఉల్లిని అధికంగా నిల్వ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. దేశంలో ప్రస్తుతం పలు ప్రాంతాల్లో ఉల్లి ధర కిలో 80 రూపాయలను దాటేసి దూసుకెళ్తోంది. కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నా అవేవి ఫలించలేదు.

ఉల్లి దిగుబడి ఎక్కువగా ఉండే మహారాష్ట్ర, కర్నాటక వంటి రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా సరఫరా పడిపోయింది. ఆగస్ట్ నుంచే ఉల్లి దూకుడు మొదలై ఇప్పుడు అది రంకెలేసే స్థాయికి చేరడంతో కేంద్రం కట్టడి చర్యలకు పూనుకుంది.

ఉల్లి ధర కట్టడికి ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ లాంటి రాష్ట్రాలు సబ్సిడీ మీద ఉల్లిని ప్రజలకు అందించే ప్రయత్నాలు చేస్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News