సొంత మండలంలోనే పోస్టింగ్.. మూడు ఆప్షన్స్
గ్రామ సచివాలయ ఉద్యోగాల నియామక పక్రియ దాదాపు పూర్తయింది. నేడు ఆఫర్ లెటర్స్‌ను ఉద్యోగాలు సాధించిన వారికి అందించనున్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభిస్తారు. ఎంపికైన వారి నియామకాలకు సంబంధించిన విధివిధానాలను కూడా వెల్లడించారు. ఉద్యోగాలకు ఎంపికైన వారికి సొంత గ్రామంలో పోస్టింగ్ ఇవ్వడం లేదు. సొంత గ్రామం కాకుండా సొంత మండలంలోనే మరో గ్రామంలో వారిని నియమిస్తారు. సొంత గ్రామం మినహాయించి సొంత మండలంలో ఏ గ్రామంలో ఉద్యోగం […]
గ్రామ సచివాలయ ఉద్యోగాల నియామక పక్రియ దాదాపు పూర్తయింది. నేడు ఆఫర్ లెటర్స్‌ను ఉద్యోగాలు సాధించిన వారికి అందించనున్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభిస్తారు. ఎంపికైన వారి నియామకాలకు సంబంధించిన విధివిధానాలను కూడా వెల్లడించారు. ఉద్యోగాలకు ఎంపికైన వారికి సొంత గ్రామంలో పోస్టింగ్ ఇవ్వడం లేదు. సొంత గ్రామం కాకుండా సొంత మండలంలోనే మరో గ్రామంలో వారిని నియమిస్తారు.
సొంత గ్రామం మినహాయించి సొంత మండలంలో ఏ గ్రామంలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారు అన్నది అభ్యర్థులే ఎంపిక చేసుకోవచ్చు. వారికి మూడు స్థానాలను ఆప్షన్‌గా ఇస్తారు. ఒకవేళ ఒకే స్థానానికి ఎక్కువ మంది పోటీ పడితే మాత్రం అప్పుడు మెరిట్ ప్రాతిపదికన అవకాశం ఇస్తారు. ఒకే మండలంలో ఎక్కువ మంది చేరేందుకు ఆసక్తి చూపితే… మిగిలిన వారిని పక్క మండలాల్లో నియమిస్తారు. ఎంపికైన వారందరికీ సొంత జిల్లాలోనే పోస్టింగ్ ఇస్తారు. జిల్లా వెలుపలకు వెళ్లాల్సిన పని లేదు. ఈ విధివిధానాలను అన్ని జిల్లా కలెక్టర్లకు పంపించారు.
విజయవాడలో జరిగే నియామక పత్రాలు అందజేత కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరవుతారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగాన్ని అన్ని జిల్లాల్లోని సచివాలయ ఉద్యోగులు చూసేలా జిల్లా కేంద్రాల్లో ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఆయా జిల్లాల్లో మంత్రుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ నియామక పత్రంలోనే సదరు ఉద్యోగిని ఎక్కడ నియమించారన్నది ఉంటుంది.