ఈ ఏడాది ఎల్‌నినో పోయింది... సీమకు కనీసం మరో రెండు భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ మాజీ డైరెక్టర్ కేజే రమేష్‌ వెల్లడించారు. ఇటీవలే పదవి విరమణ చేసిన ఆయన రాయలసీమ, తెలంగాణలో అక్టోబర్‌ 5లోపు కనీసం రెండుసార్లు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. కొన్నేళ్లుగా తమ అంచనాలు తప్పడం లేదన్నారు. ఇటీవల హైదరాబాద్, అనంతపురం జిల్లాల్లో కురిసిన భారీ వర్షాల తరహాలోనే కనీసం రెండుసార్లు భారీ వర్షం వస్తుందని వివరించారు. అక్టోబర్ 5 వరకు నైరుతి రుతుపవనాలు బలంగా ఉంటాయని… ఈసారి […]

Advertisement
Update:2019-09-29 04:47 IST

తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ మాజీ డైరెక్టర్ కేజే రమేష్‌ వెల్లడించారు. ఇటీవలే పదవి విరమణ చేసిన ఆయన రాయలసీమ, తెలంగాణలో అక్టోబర్‌ 5లోపు కనీసం రెండుసార్లు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు.

కొన్నేళ్లుగా తమ అంచనాలు తప్పడం లేదన్నారు. ఇటీవల హైదరాబాద్, అనంతపురం జిల్లాల్లో కురిసిన భారీ వర్షాల తరహాలోనే కనీసం రెండుసార్లు భారీ వర్షం వస్తుందని వివరించారు. అక్టోబర్ 5 వరకు నైరుతి రుతుపవనాలు బలంగా ఉంటాయని… ఈసారి ఈశాన్య రుతుపవనాలు కూడా బలంగా ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈశాన్య రుతుపవనాల వల్ల రాయలసీమ, దక్షిణ కోస్తా, తమిళనాడులో మంచి వర్షాలు ఉంటాయన్నారు.

నైరుతి రుతు పవనాలు నిజానికి ఇప్పటికే తిరోగమనం కావాల్సిందని కానీ ఆ పరిస్థితి కనిపించడం లేదన్నారు. ఈ ఏడాది ఎల్‌నినో లేకుండా పోవడంతోనే భారీ వర్షాలు కురుస్తున్నాయని కేజే రమేష్ వివరించారు. పలు సంస్థలు ఈ ఏడాది ఎల్‌నినో ఉంటుందని చెప్పినా… ఐఎండీ మాత్రం అలాంటి పరిస్థితి ఉండదని ముందే చెప్పిందన్నారు.

తాము ఐఎండీ తరపున చెప్పిన్నట్టుగానే పశ్చిమ తీరంలో భారీ వర్షాలు కురిశాయని… దాని వల్ల 10 రోజుల్లోనే శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు నిండిపోయాయన్నారు. అక్టోబర్ 5లోపు రాయలసీమకు మరో రెండు సార్లు భారీ వర్షాల పొంచి ఉన్నందున ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని కేజే రమేష్ హెచ్చరించారు.

Tags:    
Advertisement

Similar News