భారత్ కు పోస్టల్ సర్వీసులను కూడా నిలిపివేసిన పాక్

ఇప్పటికే భారత్ కు బస్సు, రైలు సర్వీసులను రద్దు చేసిన పాకిస్తాన్ భారత విమానాలను పాకిస్తాన్ గగనతలం గుండా కూడా అనుమతించడం లేదు. భారత్ తో వాణిజ్య సంబంధాలను కూడా తెంచుకుంది. తాజాగా భారత్ కు పోస్టల్ సేవలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్ళూ పాకిస్తాన్ లో ప్రచురితమయ్యే మేగజైన్లు, ఇతర పబ్లికేషన్లు భారత్ లోని పంజాబ్ రాష్ట్రానికి పోస్టు ద్వారా పంపేవారు. అయితే ఇప్పుడు ఆ సేవలను కూడా పాకిస్తాన్ బ్రేక్ చేసింది. భారత్ కు […]

Advertisement
Update:2019-09-28 06:42 IST

ఇప్పటికే భారత్ కు బస్సు, రైలు సర్వీసులను రద్దు చేసిన పాకిస్తాన్ భారత విమానాలను పాకిస్తాన్ గగనతలం గుండా కూడా అనుమతించడం లేదు. భారత్ తో వాణిజ్య సంబంధాలను కూడా తెంచుకుంది.

తాజాగా భారత్ కు పోస్టల్ సేవలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్ళూ పాకిస్తాన్ లో ప్రచురితమయ్యే మేగజైన్లు, ఇతర పబ్లికేషన్లు భారత్ లోని పంజాబ్ రాష్ట్రానికి పోస్టు ద్వారా పంపేవారు. అయితే ఇప్పుడు ఆ సేవలను కూడా పాకిస్తాన్ బ్రేక్ చేసింది.

భారత్ కు అన్ని పోస్టల్ సేవలను పాకిస్తాన్ ప్రభుత్వం నిలిపివేసినట్లుగా భారత పోస్టల్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అజయ్ కుమార్ రాయ్ తెలిపారు. ఇక పాకిస్తాన్ కు ఉత్తరాలు రాయడం కానీ.. పాకిస్తాన్ నుంచి ఉత్తరాలు ఇక్కడికి పంపడం కానీ ఇక ఉండదని రాయ్ స్పష్టం చేశారు.

దీంతో పాకిస్తాన్ తో ఏ బంధం కూడా భారత్ పెట్టుకోదని స్పష్టమైంది. ఇప్పటికే పాకిస్తాన్ అన్ని బంధాలు తెంచుకోగా.. ఇప్పుడు పోస్టల్ సేవలను కూడా నిలిపివేయడంతో అన్ని బంధాలు తెంచుకున్నట్టు అయ్యింది.

Tags:    
Advertisement

Similar News