ఆమె తన జుట్టును క్యాన్సర్ వ్యాధిగ్రస్థుల విగ్స్ కోసం దానం చేసింది

కేరళకు చెందిన ఓ లేడీ పోలీస్ ఆఫీసర్ ఆమె జుట్టును క్యాన్సర్ వ్యాధిగ్రస్థులకు విగ్స్ కోసం దానం చేసింది. త్రిస్సూర్ జిల్లాలోని ఇరింజలకుడకు చెందిన సీనియర్ సివిల్ పోలీస్ ఆఫీసర్ అపర్ణ లవకుమార్… కీమోథెరపి చేయించుకున్నందువల్ల జుట్టు ఊడిపోయిన క్యాన్సర్ పేషెంట్లకు ఉపయోగార్థం తన అందమైన జుట్టును దానం చేసింది. క్యాన్సర్‌తో పోరాడుతున్న 5 వ తరగతి చదివే బాలికను కలిసిన తర్వాత 46 ఏళ్ల ఈ పోలీసు అధికారి ఈ నిర్ణయం తీసుకున్నారు. తన తల […]

Advertisement
Update:2019-09-27 10:05 IST

కేరళకు చెందిన ఓ లేడీ పోలీస్ ఆఫీసర్ ఆమె జుట్టును క్యాన్సర్ వ్యాధిగ్రస్థులకు విగ్స్ కోసం దానం చేసింది.

త్రిస్సూర్ జిల్లాలోని ఇరింజలకుడకు చెందిన సీనియర్ సివిల్ పోలీస్ ఆఫీసర్ అపర్ణ లవకుమార్… కీమోథెరపి చేయించుకున్నందువల్ల జుట్టు ఊడిపోయిన క్యాన్సర్ పేషెంట్లకు ఉపయోగార్థం తన అందమైన జుట్టును దానం చేసింది.

క్యాన్సర్‌తో పోరాడుతున్న 5 వ తరగతి చదివే బాలికను కలిసిన తర్వాత 46 ఏళ్ల ఈ పోలీసు అధికారి ఈ నిర్ణయం తీసుకున్నారు. తన తల గుండు చేయించుకుని క్యాన్సర్ రోగులకు విగ్స్ చేసే ఎన్జీఓకు జుట్టు విరాళంగా ఇచ్చింది.

నిరాడంబరమైన అపర్ణ మాట్లాడుతూ… “ప్రాణాలను కాపాడటానికి అవయవాలను దానం చేసే వారితో పోలిస్తే నా చర్య ప్రశంసలకు అర్హమైనది కాదు. నా జుట్టు ఒకటి లేదా రెండు సంవత్సరాల్లో తిరిగి పెరుగుతుంది. నాకు నిజమైన హీరోలు అంటే తమ అవయవాలను అవసరమైనవారి కోసం దానం చేసే వ్యక్తులే. లుక్‌లో ఏముంది? మీ బాహ్య రూపం కంటే మీ మాటలు, పనులు ముఖ్యమైనవి” అని అన్నారు.

గతం లో… తమ బంధువుల మృతదేహాన్ని ఆస్పత్రి నుండి విడిపించుకోవడానికి రూ. 60,000 రూపాయల ఆసుపత్రి బిల్లును కట్టలేక యాతన పడుతున్న ఒక కుటుంబానికి ఆమె తన మూడు బంగారు గాజులను విరాళంగా ఇచ్చిన జాలి గుండె ఆమెది.

నిజానికి అపర్ణ కూడా కఠినమైన పరిస్థితుల్లోనే ఉంది, భర్తను కోల్పోయిన తరువాత, ఆమె ఇద్దరు కుమార్తెలను స్వయంగా పెంచవలసి వచ్చింది. ఆమె పెద్ద కూతురు పోస్ట్ గ్రాడ్యుయేట్. చిన్నామె 10 వ తరగతి చదువుతూ ఉంది. వారి బాధ్యతలు ఒంటరిగా మోస్తూ… ఇతరులకు ఆపన్న హస్తం అందిస్తున్న ఈ లేడీ పోలీస్ అధికారికి ‘సెల్యూట్’ చెయ్యాల్సిందే.

Tags:    
Advertisement

Similar News