చింతకాయలపై కేసు నమోదు
టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా టీడీపీ నేతలు నోటిని, చేతలను కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఇంకా అధికారంలోనే ఉన్నట్టుగా దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికే అధికారులను, పోలీసులను దూషించి టీడీపీ నేతలు కూన రవికుమార్, చింతమనేని లాంటి వారు కేసుల్లో ఇరుకున్నారు. తాజాగా ఆ జాబితాలో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కూడా చేరారు. ఇటీవల ఒక మీటింగ్‌లో మంత్రులు, ఐపీఎస్ అధికారులపై చింతకాయల నోటికొచ్చినట్టు దూషణలు చేశారు. రాయలేని భాషతో తిట్టారు. అంతటితో ఆగకుండా రాయలసీమ ప్రాంతాన్ని, […]
టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా టీడీపీ నేతలు నోటిని, చేతలను కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఇంకా అధికారంలోనే ఉన్నట్టుగా దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికే అధికారులను, పోలీసులను దూషించి టీడీపీ నేతలు కూన రవికుమార్, చింతమనేని లాంటి వారు కేసుల్లో ఇరుకున్నారు.
తాజాగా ఆ జాబితాలో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కూడా చేరారు. ఇటీవల ఒక మీటింగ్‌లో మంత్రులు, ఐపీఎస్ అధికారులపై చింతకాయల నోటికొచ్చినట్టు దూషణలు చేశారు. రాయలేని భాషతో తిట్టారు. అంతటితో ఆగకుండా రాయలసీమ ప్రాంతాన్ని, కొన్ని కులాలను కించపరిచేలా అసభ్యకరంగా దూషించారు.
పోలీసు అధికారులపైనా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులను, ఐపీఎస్ అధికారులను దూషించడంతో పాటు ప్రాంతాలను, కులాలను కించపరిచి సమాజంలో చీలికలు తెచ్చేందుకు ప్రయత్నించారంటూ చింతకాయల అయ్యన్నపాత్రుడిపై విశాఖ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అయింది. అయ్యన్నపాత్రుడిపై ఐపీసీ 153ఏ, 500, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు ఏసీపీ కులశేఖర్ వెల్లడించారు.