ఉగ్రవాదుల హిట్ లిస్టులో మోడీ, అమిత్ షా , థోవల్
ఉగ్రవాదులు మరోసారి తమ హిట్ లిస్ట్ ను ప్రకటించారు. ఈసారి తమ హిట్ లిస్టులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ థోవల్ ఉన్నారంటూ ఉగ్రవాదులు ఓ లేఖలో పేర్కొన్నారు. పౌర విమానయాన భద్రత శాఖకు జైషే మహ్మద్ ఉగ్రవాది సంస్థ పేరిట ఓ హెచ్చరిక లేఖ అందింది. ఈ లేఖలో ప్రధానమంత్రి, కేంద్ర హోం మంత్రి, జాతీయ భద్రతా సలహాదారులను వదిలేది లేదంటూ ఉగ్రవాదులు హెచ్చరికలు జారీ […]
ఉగ్రవాదులు మరోసారి తమ హిట్ లిస్ట్ ను ప్రకటించారు. ఈసారి తమ హిట్ లిస్టులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ థోవల్ ఉన్నారంటూ ఉగ్రవాదులు ఓ లేఖలో పేర్కొన్నారు.
పౌర విమానయాన భద్రత శాఖకు జైషే మహ్మద్ ఉగ్రవాది సంస్థ పేరిట ఓ హెచ్చరిక లేఖ అందింది. ఈ లేఖలో ప్రధానమంత్రి, కేంద్ర హోం మంత్రి, జాతీయ భద్రతా సలహాదారులను వదిలేది లేదంటూ ఉగ్రవాదులు హెచ్చరికలు జారీ చేశారు.
ఈ నెల 10వ తేదీన పంపినట్లుగా భావిస్తున్న ఈ లేఖలో జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా దేశంలో అరాచకాలు సృష్టిస్తామంటూ పేర్కొన్నట్లు చెబుతున్నారు. దీంతో ఎయిర్ బేస్ కేంద్రాలు ఉన్న జమ్మూ, కాశ్మీర్, అవంతి పోరా, పఠాన్ కోట్ విమానాశ్రయాల వద్ద అలర్ట్ ప్రకటించారు.
ఉగ్రవాదుల హెచ్చరికల నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించింది కేంద్ర హోం శాఖ. దేశంలోని జమ్మూ, కాశ్మీర్, అమృతసర్, కాన్పూర్ సహా 30 నగరాలలో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారని లేఖ ద్వారా తేలడంతో ఆయా నగరాలలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
న్యూయార్క్ లో ఐక్యరాజ్యసమితి సమావేశాలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ప్రపంచం దృష్టిని ఆకర్షించేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడే అవకాశం ఉందని, వీటిని సమర్థవంతంగా తిప్పికొట్టాలని ప్రభుత్వాలకు కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది.