ప్రపంచ కుస్తీలో భారత వస్తాదుల షో
5 పతకాలతో అత్యుత్తమ ప్రదర్శన నలుగురు మల్లయోధులకు ఒలింపిక్స్ అర్హత కజకిస్తాన్ లోని నూర్ సుల్తాన్ వేదికగా ముగిసిన 2019 ప్రపంచ కుస్తీ పోటీలలో…భారత వస్తాదుల బృందం అత్యుత్తమంగా రాణించి… అత్యధిక పతకాలతో స్వదేశానికి తిరిగి వచ్చింది. పతక విజేతలను కేంద్ర క్రీడామంత్రి కిరణ్ రిజ్జూ ప్రోత్సాహక నగదు బహుమతులతో సత్కరించారు. స్వదేశానికి తిరిగి వచ్చిన వెంటనే…మర్యాదపూర్వకంగా క్రీడామంత్రిని వస్తాదుల బృందం కలిసింది. నాలుగు ఒలింపిక్ బెర్త్ లు… ప్రపంచ కుస్తీ పోటీల పురుషుల, మహిళల విభాగాలలో కలసి మొత్తం […]
- 5 పతకాలతో అత్యుత్తమ ప్రదర్శన
- నలుగురు మల్లయోధులకు ఒలింపిక్స్ అర్హత
కజకిస్తాన్ లోని నూర్ సుల్తాన్ వేదికగా ముగిసిన 2019 ప్రపంచ కుస్తీ పోటీలలో…భారత వస్తాదుల బృందం అత్యుత్తమంగా రాణించి… అత్యధిక పతకాలతో స్వదేశానికి తిరిగి వచ్చింది.
పతక విజేతలను కేంద్ర క్రీడామంత్రి కిరణ్ రిజ్జూ ప్రోత్సాహక నగదు బహుమతులతో సత్కరించారు. స్వదేశానికి తిరిగి వచ్చిన వెంటనే…మర్యాదపూర్వకంగా క్రీడామంత్రిని వస్తాదుల బృందం కలిసింది.
నాలుగు ఒలింపిక్ బెర్త్ లు…
ప్రపంచ కుస్తీ పోటీల పురుషుల, మహిళల విభాగాలలో కలసి మొత్తం ఐదుగురు భారత వస్తాదులు పతకాలు సాధించగా… వీరిలో నలుగురు… వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్ కుస్తీలో పాల్గొనటానికి అర్హత సంపాదించారు.
పురుషుల 86 కిలోల విభాగంలో దీపక్ పూనియా రజత పతకం సాధించాడు. దీపక్ కు 7 లక్షల రూపాయల చెక్ ను క్రీడామంత్రి అందచేశారు.
65 కిలోల విభాగంలోభజరంగ్ పూనియా, మహిళల 53 కిలోల విభాగంలో వినేశ్ పోగట్, పురుషుల 57 కిలోల విభాగంలో రవి దహియా, 61 కిలోల విభాగంలో రాహుల్ అవారే కాంస్యపతకాలు సాధించారు.
కాంస్య పతక విజేతలకు 4 లక్షల రూపాయల చొప్పున నగదు పురస్కారాన్ని అందచేశారు.
ప్రపంచ కుస్తీ చరిత్రలోనే భారత వస్తాదుల బృందం నాలుగు కాంస్య, ఓ రజత పతకం సాధించడం ఇదే మొదటిసారి.
రాహుల్ అవారే మినహా మిగిలిన నలుగురు వస్తాదులు టోక్యో ఒలింపిక్స్ బెర్త్ లు ఖాయం చేసుకోగలిగారు.
ఒలింపిక్స్ కుస్తీలో మొత్తం 18 రకాల అంశాలలో పతకాల పోటీ ఉంటుంది.