50 రూపాయలకే 15 వైద్య పరీక్షలు
బీపీ చూడాలంటే 50… షుగర్ టెస్ట్ కు 100.. కిడ్నీలు ఎలా పనిచేస్తున్నాయో తెలియాలంటే 800.. లివర్ తన పని తాను చేస్తోందా..? లేదా..? తెలియాలి అంటే ఇంకో ఐదు వందలు. గుండెకు సంబంధించిన పరీక్షలు అయితే సరేసరి. వైద్య పరీక్షల కోసం వెళ్లిన వారు ఆస్తులు కుదవ పెట్టాల్సిన పరిస్థితి. అయితే దక్షిణ మధ్య రైల్వే మాత్రం తమ ప్రయాణీకుల కోసం 50 రూపాయలకే ఏకంగా 15 వైద్య పరీక్షలు చేయించే పనిని ప్రారంభించింది. సికింద్రాబాద్, […]
బీపీ చూడాలంటే 50… షుగర్ టెస్ట్ కు 100.. కిడ్నీలు ఎలా పనిచేస్తున్నాయో తెలియాలంటే 800.. లివర్ తన పని తాను చేస్తోందా..? లేదా..? తెలియాలి అంటే ఇంకో ఐదు వందలు. గుండెకు సంబంధించిన పరీక్షలు అయితే సరేసరి. వైద్య పరీక్షల కోసం వెళ్లిన వారు ఆస్తులు కుదవ పెట్టాల్సిన పరిస్థితి.
అయితే దక్షిణ మధ్య రైల్వే మాత్రం తమ ప్రయాణీకుల కోసం 50 రూపాయలకే ఏకంగా 15 వైద్య పరీక్షలు చేయించే పనిని ప్రారంభించింది. సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్ లలోని ఒకటో నంబరు ఫ్లాట్ ఫాం వద్ద ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలలో ఈ 15 రకాల వైద్య పరీక్షలు నిర్వహించే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, కిడ్నీ పరీక్షలు వంటి 15 రకాల వైద్య పరీక్షలను 50 రూపాయలు తీసుకొని చేస్తుండడంతో ప్రయాణికుల నుంచి విశేష స్పందన వస్తోంది. వేలాది కిలోమీటర్ల ప్రయాణం చేసేవారు, నిద్రపట్టక బాధపడే వారికి ఎప్పటికప్పుడు తమ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఈ వైద్య శిబిరాలు ఉపయోగపడుతున్నాయని ప్రయాణికులు అంటున్నారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రతిరోజు సుమారు రెండు లక్షల మంది, కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి లక్ష మంది ప్రయాణిస్తుంటారు. వీరి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలియజేసేందుకు ఈ శిబిరాలు ఉపయోగ పడుతున్నాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు. మంచి ఫలితాలు ఇస్తున్న ఈ వైద్య శిబిరాలను రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రముఖ రైల్వేస్టేషన్ లలో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.