రివర్స్ టెండరింగ్.... తొలి ప్రయత్నమే గ్రాండ్ సక్సెస్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన రివర్స్ టెండరింగ్ విధానం ఊహించని విధంగా సత్ఫలితాలను ఇస్తోంది. తొలిసారిగా పోలవరం ప్రాజెక్ట్ లోని 65 ప్యాకేజి పనికి టెండర్ పిలవగా అంచనా వ్యయం కన్నా 15.6 శాతం తక్కువకు అంటే మొత్తం పని విలువలో 43 కోట్ల రూపాయలు తక్కువకు ఓ సంస్థ ఎల్-1గా బిడ్ దాఖలు చేసినట్లుగా తెలిసింది. గత టిడిపి ప్రభుత్వంలో ఇదే ప్యాకేజీని 274 కోట్లకు కాంట్రాక్టర్లకు అప్పగించగా దానిని రద్దు చేసిన వైయస్ జగన్ మోహన్ […]

Advertisement
Update:2019-09-20 13:41 IST

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన రివర్స్ టెండరింగ్ విధానం ఊహించని విధంగా సత్ఫలితాలను ఇస్తోంది. తొలిసారిగా పోలవరం ప్రాజెక్ట్ లోని 65 ప్యాకేజి పనికి టెండర్ పిలవగా అంచనా వ్యయం కన్నా 15.6 శాతం తక్కువకు అంటే మొత్తం పని విలువలో 43 కోట్ల రూపాయలు తక్కువకు ఓ సంస్థ ఎల్-1గా బిడ్ దాఖలు చేసినట్లుగా తెలిసింది.

గత టిడిపి ప్రభుత్వంలో ఇదే ప్యాకేజీని 274 కోట్లకు కాంట్రాక్టర్లకు అప్పగించగా దానిని రద్దు చేసిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అదే పనికి రివర్స్ టెండరింగ్ నిర్వహించగా ఓ సంస్థ 231 కోట్లకు బిడ్డింగ్ దాఖలు చేసినట్లు తెలిసింది.

ఆ సంస్థ పేరుతో పాటు మిగిలిన సంస్థలు కూడా ఎంతెంత ధరకు టెండర్లు దాఖలు చేశారనే విషయాలు ఈ రాత్రికి అధికారికంగా తెలిసే అవకాశం ఉంది. కేవలం మూడు వందల కోట్ల పనిలోనే రివర్స్ టెండరింగ్ లో 43 కోట్ల ఆదా ఉంటే భవిష్యత్తులో ఖరారు కానున్న హైడల్, హెడ్ వర్క్స్ కు సంబంధించిన పనుల్లో ఎంత మొత్తం ఆదా అవుతుందో ఊహించుకోవచ్చు.

సాధారణంగా ఎల్-1గా వచ్చిన సంస్థకు పనిని అప్పగిస్తూ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుంది. అయితే రివర్స్ టెండరింగ్ లో ఎల్-1గా వచ్చిన సంస్థ ధరను బేసిక్ బెంచ్ మార్క్ గా ప్రకటించి దాని ఆధారంగా మరింత తక్కువకు సంస్థలు టెండర్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. దాంతో తొలుత పిలిచిన 65వ ప్యాకేజీలోని పనికి 15.6 శాతం తక్కువకు ఓ సంస్థ బిడ్ దాఖలు చేసింది. మిగిలిన సంస్థల కన్నా ఇది బాగా తక్కువ కావడంతో ఈ సంస్థకు పనిని అప్పగించే అవకాశాలు ఉన్నాయి.

శుక్రవారం ఉదయం 11 గంట నుంచి ఈ-ఆక్షన్ (రివర్స్ టెండరింగ్) నిర్వహించారు. ఇందులో ఆరు సంస్థలు పోటీపడ్డాయి. రెండు గంటల 45 నిమిషాల పాటు ఈ-ఆక్షన్ నిర్వహించారు. అత్యంత తక్కువకు బిడ్ వేసిన సంస్థ అర్హతలను పరిశీలించి పనులు అప్పగించే అవకాశం ఉంది.

దేశంలో ఎక్కడాలేని రీతిలో రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా రివర్స్ టెండరింగ్ చేపట్టడం ఇదే తొలిసారి. ఇందులో ఆరు బడా సంస్థలు పోటీపడటాన్ని బట్టి చూస్తే.. కాంట్రాక్టు విలువ కంటే అత్యంత తక్కువ ధరకు టెండర్ ఖరారయ్యే అవకాశం ఉందని…. దీనివల్ల పెద్ద మొత్తంలో నిధులు ఆదా అవుతాయని జలవనరులశాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News