పారిశుధ్య కార్మికుల విషయంలో... కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
ఏదేశమైనా తమ పౌరుల భద్రత గురించి ఆలోచిస్తుంది తప్ప… వారిని విష వాయువులతో చంపాలని అనుకోదు… అంటూ కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పారిశుధ్య కార్మికులు పని చేసే సమయంలో మాస్క్‌లు, భద్రతా పరికరాలు, సరైన దుస్తులు అందించడంలో కేంద్రం విఫలమవుతుండటంతో సుప్రీం ఇలా వ్యాఖ్యానించింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని సమీక్షించాలని గత ఏడాది కేంద్రం వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీం బెంచ్ సదరు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పారిశుధ్య కార్మికులకు […]
ఏదేశమైనా తమ పౌరుల భద్రత గురించి ఆలోచిస్తుంది తప్ప… వారిని విష వాయువులతో చంపాలని అనుకోదు… అంటూ కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పారిశుధ్య కార్మికులు పని చేసే సమయంలో మాస్క్‌లు, భద్రతా పరికరాలు, సరైన దుస్తులు అందించడంలో కేంద్రం విఫలమవుతుండటంతో సుప్రీం ఇలా వ్యాఖ్యానించింది.
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని సమీక్షించాలని గత ఏడాది కేంద్రం వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీం బెంచ్ సదరు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
పారిశుధ్య కార్మికులకు తగిన రక్షణ ఏర్పాట్లు ఎందుకు కల్పించడం లేదని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌ను కోర్టు ప్రశ్నించింది. మలమూత్రాలు ఎత్తుతూ, మురికి కాలువల్లో దిగే కార్మికులకు ఆక్సిజన్ సిలిండర్లు ఎందుకు ఇవ్వట్లేదు..? ఏ దేశమైనా తమ పౌరులను విషవాయువులతో నిండిన ఛాంబర్లలో చనిపోవాలని పంపిస్తుందా…. మరి మీరెందుకు మ్యాన్ హోల్స్‌లో దిగే కార్మికులకు సరైన పరికరాలు ఇవ్వట్లేదని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
రాజ్యాంగం అందరికీ సమాన హక్కుల ఇచ్చిందని.. మరి పారిశుధ్య కార్మికులకు ఆ హక్కులు వర్తించవా…. అని జస్టీస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ ప్రశ్నించింది. ఈ బెంచ్‌లో జస్టీస్ ఎంఆర్ సాహ, బీఆర్ గవాయ్‌లు కూడా ఉన్నారు.
మీరు ఏ పారిశుధ్య కార్మికుడితోనైనా కరచాలనం చేస్తారా? అని మిమ్మల్ని ప్రశ్నిస్తే…. లేదనే సమాధానం ఇస్తారు అని అటార్నీ జనరల్‌తో బెంచ్ వ్యాఖ్యానించింది.
‘దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు గడిచినా అంటరానితనం లాంటి దురాచారాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి’ అని జస్టిస్ మిశ్రా ఆవేదన వ్యక్తం చేశారు.