కోడెల శివరాంను విచారించనున్న పోలీసులు
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు ఆత్మహత్య కేసులో ఆయన కుమారుడు కోడెల శివరాంను విచారించేందుకు తెలంగాణ పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. అంత్యక్రియల అనంతరం ఇతర కార్యక్రమాలు పూర్తి కాగానే శివరాంను విచారణకు పిలవనున్నారు. కోడెల శివరాం కొద్దికాలంగా తండ్రిని వేధిస్తున్నాడని… ఈ విషయాన్ని స్వయంగా కోడెల శివప్రసాదరావే తనకు ఫోన్ చేసి చెప్పారని సత్తెనపల్లి డీఎస్పీకి కోడెల బంధువు సాయి ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో ఆ ఫిర్యాదును కూడా తెలంగాణ పోలీసులు తమ పరిధిలోకి […]
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు ఆత్మహత్య కేసులో ఆయన కుమారుడు కోడెల శివరాంను విచారించేందుకు తెలంగాణ పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. అంత్యక్రియల అనంతరం ఇతర కార్యక్రమాలు పూర్తి కాగానే శివరాంను విచారణకు పిలవనున్నారు.
కోడెల శివరాం కొద్దికాలంగా తండ్రిని వేధిస్తున్నాడని… ఈ విషయాన్ని స్వయంగా కోడెల శివప్రసాదరావే తనకు ఫోన్ చేసి చెప్పారని సత్తెనపల్లి డీఎస్పీకి కోడెల బంధువు సాయి ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో ఆ ఫిర్యాదును కూడా తెలంగాణ పోలీసులు తమ పరిధిలోకి తీసుకున్నారు.
పది రోజుల క్రితం కూడా కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యాయత్నం చేయగా దాన్ని కుటుంబసభ్యులు దాచిపెట్టి గుండెపోటుగా ప్రచారం చేశారన్న అనుమానులను తెలంగాణ పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కోడెల ఆత్మహత్యకు అసలు కారణాలు తెలుసుకునేందుకు శివరాంను విచారించాలని నిర్ణయించారు.
కోడెల శివప్రసాదరావు పర్సనల్ ఫోన్ మాయం అవడంపైనా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫోన్ ద్వారా కీలక విషయాలు వెలుగులోకి వస్తాయన్న ఉద్దేశంతో దాన్ని దాచి ఉంటారని భావిస్తున్నారు.
ఆత్మహత్యకు ముందు కోడెల ఎవరితో మాట్లాడారు…. అన్న కాల్‌డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆత్మహత్యకు ముందు 24 నిమిషాల పాటు కోడెల శివప్రసాదరావు మాట్లాడింది బసవతారకం ఆస్పత్రిలోని ఒక వైద్యురాలితో అని పోలీసులు తేల్చారు. ఆమెతో ఏం మాట్లాడారు అని తెలుసుకునేందుకు వైద్యురాలిని పోలీసులు విచారించనున్నారు.
కోడెల ఆత్మహత్య చేసుకునేందుకు తొలుత తన పంచెనే వాడేందుకు ప్రయత్నించాడు. దాన్ని చీల్చేందుకు ప్రయత్నించి విఫలమైన తర్వాత గదిలో ఉన్న కేబుల్ వైర్‌తో ఉరివేసుకున్నట్టు ఫోరెన్సిక్ వైద్యులు నిర్ధారించారు.