ఆత్మహత్యకు ముందు.... చంద్రబాబు, కోడెల ఎపిసోడ్ ఇదీ....
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు ముమ్మాటికీ చంద్రబాబు వేధింపులే కారణమని మంత్రి కొడాలి నాని ఆరోపించారు. కోడెల కుటుంబంపై కేసులు పెట్టింది వ్యాపారులు, బిల్డర్స్, సామాన్యులు అని గుర్తు చేశారు. అసెంబ్లీ ఫర్నీచర్ తీసుకెళ్లినట్టు కోడెల శివప్రసాదరావే స్వయంగా మీడియా ముందు అంగీకరించారని కూడా చెప్పారు. పలువురు కేసులు పెట్టినా కోడెలను గానీ, ఆయన కుటుంబసభ్యులను అరెస్ట్ చేయడం గానీ, పోలీస్ స్టేషన్‌కు పిలవడం గానీ చేయలేదన్నారు. 40 మంది బాధితులు కేసులు పెడితే దానికే ఆత్మహత్య […]
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు ముమ్మాటికీ చంద్రబాబు వేధింపులే కారణమని మంత్రి కొడాలి నాని ఆరోపించారు. కోడెల కుటుంబంపై కేసులు పెట్టింది వ్యాపారులు, బిల్డర్స్, సామాన్యులు అని గుర్తు చేశారు. అసెంబ్లీ ఫర్నీచర్ తీసుకెళ్లినట్టు కోడెల శివప్రసాదరావే స్వయంగా మీడియా ముందు అంగీకరించారని కూడా చెప్పారు.
పలువురు కేసులు పెట్టినా కోడెలను గానీ, ఆయన కుటుంబసభ్యులను అరెస్ట్ చేయడం గానీ, పోలీస్ స్టేషన్‌కు పిలవడం గానీ చేయలేదన్నారు. 40 మంది బాధితులు కేసులు పెడితే దానికే ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడా కోడెలా అని ప్రశ్నించారు.
ప్రత్యర్ధి పార్టీ ఒకవేళ వేధిస్తే పోరాటం చేస్తారే గానీ ఆత్మహత్యలు చేసుకోరన్నారు. సొంత కుటుంబసభ్యులే దూరంగా పెట్టినప్పుడు, అడ్డు తొలగించుకోవాలని సొంత మనుషులే ఆలోచన చేసినప్పుడే ఇలా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంటుందన్నారు.
చంద్రబాబు కోసం 23 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకుండా కాపాడినప్పటికీ… ఎన్నికల తర్వాత కనీసం కలిసేందుకు అపాయింట్‌మెంట్ కూడా చంద్రబాబు ఇవ్వకపోవడంతోనే కోడెల కుంగిపోయారన్నారు.
అసెంబ్లీ ఫర్నీచర్ మాయమైన వ్యవహారంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా తాము అడ్డుకోబోమని చంద్రబాబు చెప్పిన మాటలను స్వయంగా ఈనాడు పత్రికే ప్రచురించిందని పత్రిక క్లిప్పింగ్‌లను కొడాలి నాని చూపించారు.
చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి కోడెలను పక్కన పెట్టి జూనియర్లకు మంత్రి పదవులు ఇచ్చింది నిజం కాదా… అని ప్రశ్నించారు. కనీసం సొంత నియోజకవర్గం టికెట్ కూడా ఇవ్వకుండా కోడెలను మరో నియోజకవర్గానికి పంపిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. ఇప్పుడు మాత్రం కోడెలను పల్నాటి పులి అంటూ చంద్రబాబు మాట్లాడుతున్నాడని నాని ఫైర్ అయ్యారు.
కోడెల పల్నాటి పులి అయితే… చలో ఆత్మకూరు కార్యక్రమానికి కోడెలను ఎందుకు రాకుండా అడ్డుకున్నారని ప్రశ్నించారు. సత్తెనపల్లి ఇన్‌చార్జ్ పదవి నుంచి కోడెలను తొలగించాలంటూ ఒక గ్రూప్ చేత ధర్నాలు చేయించింది చంద్రబాబు కాదా… అని నిలదీశారు.
ఇలా కోడెలను రాజకీయంగా తప్పించేందుకు రకరకాల కుట్రలు చంద్రబాబు చేశారని… పార్టీ నుంచి కోడెలను సస్పెండ్ చేసేందుకు మూడు రోజుల పాటు గుంటూరులో టీడీపీ నేతలతో చంద్రబాబు చర్చలు జరిపింది నిజం కాదా అని ప్రశ్నించారు. చివరకు అలా సస్పెండ్ చేస్తే తన గుట్టు మొత్తం కోడెల బయటపెడుతారని భయపడి చంద్రబాబు వెనక్కు తగ్గారన్నారు.
నిన్న ఉదయం కలుద్దామని హైదరాబాద్ లో కోడెలకు అపాయింట్‌మెంట్ ఇచ్చిన చంద్రబాబు… ఆ తర్వాత అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా విజయవాడకు వెళ్లిపోయాడని… దాంతోనే తీవ్ర ఆవేదనకు గురై కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్నాడని కొడాలి నాని వివరించారు.
కోడెల శివప్రసాదరావు కాల్ లిస్ట్ చూస్తే ఆయన చంద్రబాబు అపాయింట్‌మెంట్ కోసం ఆఖరిలో ఎంతగా ప్రయత్నించాడో తెలుస్తుందన్నారు. చనిపోయే ముందు కోడెల ఏమైనా తన గురించి లేఖలు రాశారో ఏమో అని భయపడిపోయి మొదటి మూడు నాలుగు గంటల పాటు చంద్రబాబు దాక్కున్నారని కొడాలి నాని ఆరోపించారు.
ఎలాంటి లేఖ రాయలేదని తెలిసిన తర్వాత మీడియా ముందుకొచ్చి పులి అంటూ చంద్రబాబు మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు చెప్పినట్టు కోడెల పల్నాటి పులి అయితే… అప్పుడు చంద్రబాబు నక్క అవుతారని విమర్శించారు.
నారా లోకేష్ నేరుగా కోడెల శివరాంతో సంబంధాలు పెట్టుకుని ప్రతి పనిలోనూ కమీషన్లు, వాటాలను వసూలు చేస్తూ వచ్చారన్నారు. చంద్రబాబు మాటలు విని కోడెల శివప్రసాదరావు… లోకేష్ మాటలు విని కోడెల శివరాం చేయకూడని పనులు చేసింది వాస్తవమన్నారు.
చంద్రబాబు చేయించిన తప్పుడు పనుల వల్లే కోడెలకు ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ఎన్టీఆర్ అంతిమ యాత్రలో పాల్గొనేందుకు వచ్చిన చంద్రబాబుపై ప్రజలు చెప్పులు విసిరితే… అవి రెండుమూడు లారీలకు అయ్యాయని కొడాలి చెప్పారు. కోడెల అంత్యక్రియలకు వెళ్లే సమయంలో చంద్రబాబుపై అక్కడి ప్రజలు చెప్పులు వేస్తే అందుకు ప్రభుత్వాన్ని నిందించవద్దన్నారు.
చంద్రబాబు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వకుండా అవమానించడం వల్లే కోడెల చనిపోయాడని ఆయన కుటుంబసభ్యులు ఎక్కడ చెబుతారో అన్న ఉద్దేశంతోనే కోడెల కుటుంబంపై చంద్రబాబు ఎనలేని ప్రేమ ప్రదర్శిస్తున్నారన్నారు.
కోడెల శవం బూడిదైన తర్వాత కోడెల కుటుంబసభ్యులకు చంద్రబాబు చుక్కలు చూపిస్తారని కొడాలి నాని వివరించారు. కోడెల పిల్లలు ఎవరో కూడా తనకు తెలియదని చంద్రబాబు చెప్పినా ఆశ్చర్యం లేదన్నారు.