హోదా కేసులు ఎత్తివేత: ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఉద్యమించిన ఉద్యమ కారులకు శుభవార్త. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ ఉద్యమం చేసిన వారిపై గత ప్రభుత్వం నమోదు చేసిన కేసులను వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎత్తివేసింది. ప్రత్యేక హోదా ఉద్యమ సమయంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఉద్యమకారులపై అనేక కేసులు పెట్టింది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ కేసులన్నింటినీ ఎత్తివేస్తామని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆ హమీకి అనుగుణంగా శుక్రవారం నాడు ప్రత్యేక హోదా […]

Advertisement
Update:2019-09-14 02:39 IST

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఉద్యమించిన ఉద్యమ కారులకు శుభవార్త. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ ఉద్యమం చేసిన వారిపై గత ప్రభుత్వం నమోదు చేసిన కేసులను వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎత్తివేసింది.

ప్రత్యేక హోదా ఉద్యమ సమయంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఉద్యమకారులపై అనేక కేసులు పెట్టింది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ కేసులన్నింటినీ ఎత్తివేస్తామని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆ హమీకి అనుగుణంగా శుక్రవారం నాడు ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి ఉద్యమ కారులపై నమోదు చేసిన కేసులన్నింటినీ ఎత్తివేస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్ర విభజన సమయంలోను, ఆ తర్వాత జరిగిన ఎన్నికలకు ముందు తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలు రాష్ట్ర్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ఎన్నికల హామీ ఇచ్చాయి. అయితే ఎన్నికలు ముగిసి రెండు పార్టీలు అటు కేంద్రంలోను, ఇటు రాష్ట్రంలోనూ అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా మాటనే మరిచారు.

తెలుగుదేశం పార్టీ అధినేత, అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే ఏకంగా ప్రత్యేక హోదా సంజీవని కాదంటూ ప్రకటించారు.

ఆ సమయంలో ప్రధాన ప్రతిపక్షం వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమం చేపట్టింది. ఈ ఉద్యమాన్ని అణిచివేసేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనేక చర్యలకు పాల్పడింది.

కార్యకర్తలను, ప్రజలను ఎక్కడికక్కడ అరెస్టులు చేయించింది. వారిపై అక్రమ కేసులూ బనాయించింది. అయినా ఏపీ ప్రజలు మాత్రం తమకు ప్రత్యేక హోదా కావాల్సిందే అంటూ నినదించారు.

ఈ నేపథ్యంలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు అండగా ఉంది. దీంతో ఉద్యమం మరింత ఎగిసిపడింది. ఆ సమయంలో ఉద్యమకారులందరిపైనా కేసులు పెట్టింది చంద్రబాబునాయుడు ప్రభుత్వం.

ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్లుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఉద్యమకారులపై పెట్టిన కేసులన్నింటిని ఎత్తివేసారు. ఈ మేరకు రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి కె.ఆర్.ఎం.కిషోర్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల ముందు కేసులు ఎత్తివేస్తామంటూ ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకున్నారంటూ ఉద్యమకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News